ETV Bharat / bharat

మహిళా కానిస్టేబుల్​పై సామూహిక అత్యాచారం - women constable raped

ఓ మహిళా కానిస్టేబుల్​పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్​ నీముచ్​లో జరిగింది. ఈ దృశ్యాలను చిత్రీకరించి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు.

madyapradesh crime news
మధ్యప్రదేశ్​
author img

By

Published : Sep 25, 2021, 4:25 PM IST

మధ్యప్రదేశ్​ నీముచ్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 30ఏళ్ల మహిళా కానిస్టేబుల్​పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ దృశ్యాలను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన ఈ నెల తొలి వారంలో జరిగింది. 13న బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టారు పోలీసులు. అనంతరం ప్రధాన నిందితుడు, అతని తల్లి సహా మొత్తంగా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

మహిళా కానిస్టేబుల్​కు నిందితుడు ఫేస్​బుక్​లో పరిచయమయ్యాడు. ఏప్రిల్​ నుంచి వాట్సాప్​లో చాట్​ చేసుకుంటున్నారు. తన సోదరుడి పుట్టిన రోజుకు ఆమెను ఆహ్వానించాడు. అక్కడికి ఆమె వెళ్లగా.. ఆ వ్యక్తి, అతని సోదరుడు, మరో వ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వీడియోను అడ్డం పెట్టుకుని.. తన నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రధాన నిందితుడి తల్లి ప్రయత్నించిందని బాధితురాలు ఆరోపించింది. పూర్తి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి:- దివ్యాంగ బాలికపై అత్యాచారం.. మరో ఐదుగురిపై లైంగిక వేధింపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.