ETV Bharat / bharat

నిద్ర పోటీలకు మీరు రెడీనా?.. రూ.లక్ష స్టైపెండ్!.. గెలిస్తే రూ.10లక్షలు

నిద్ర లేకుండా వర్క్​ చేసి డబ్బులు సంపాదించే ఉద్యోగాలను చూసుంటారు. కానీ నిద్రపోతూనే లక్షల సంపాదనను తెచ్చిపెట్టే అవకాశాన్ని బహూశా చూసుండకపోవచ్చు. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే...

wakefit sleep internship in india
wakefit sleep internship in india
author img

By

Published : Nov 3, 2022, 6:58 PM IST

wake fit india : రియాల్టీ షోలకు బాస్​గా నిలుస్తున్న బిగ్​బాస్​ అంటే ఆసక్తి ఉందని వారంటూ ఉండరూ. దాదాపు 100 రోజుల పాటు ఒక ఇంట్లో బందీగా ఉండే కంటెస్టెంట్లు వివిధ టాస్కులు చేసి ఆఖరి మెట్టుకు చేరుకుంటారు. అదే తరహా షోకు మనల్ని ఆహ్వానిస్తే.. ఎటువంటి టాస్కులు చేయకుండా, కేవలం నిద్రపోతే చాలు.. అక్షరాల పది లక్షలు వరిస్తాయంటే..? అలాంటి ఆఫర్​ను ఎవరు కాదంటారు? ఇలాంటి విన్నూత్న ఆఫర్​కు బీజం వేసింది 'వేక్​ ఫిట్'​ అనే ఓ సంస్థ.

తాము తయారు చేసిన పరుపుల మార్కెటింగ్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది వేక్ ఫిట్ సంస్థ. మూడేళ్ల క్రితం ఈ స్లీప్​ ఇంటర్న్​షిప్​ను ఆవిష్కరించింది. ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఎంతో మంది దరఖాస్తు చేసుకుంటారు. అందులో 15 మందిని ఫైనలైజ్​ చేసి వారి మధ్య పోటీ నిర్వహిస్తారు. వీళ్లు చేయాల్సిందల్లా ఆ సంస్థ ఇచ్చిన పరుపుపై 100 రోజుల పాటు 9 గంటల సేపు కంటి నిండా కునుకు తీయడం. దీని కోసం వారికి లక్ష రూపాయల స్టైపెండ్​ను అందజేస్తుంది సంస్థ.

కంటెస్టెంట్స్​ ఎంత సేపు పడుకున్నారు అనే విషయాన్ని స్లీప్​ ట్రాకర్​ అనే డివైజ్ ట్రాక్​ చేస్తుంది.​ అలా నిద్రపోయిన టాప్​ 4 కంటెస్టెంట్స్​ను ఫైనల్స్​కు పంపిస్తారు. ఆఖరున వారిలో ఒక్కరినే స్లీపింగ్​ కింగ్​ లేకుంటే క్వీన్​గా ఎన్నుకుంటారు. సెలబ్రిటీలు సైతం ఈ కాంపిటిషన్​ గురించి తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ సంస్థకు బ్రాండ్​ అంబాసిడర్​ కూడా తనే.

మొదటి సీజన్​లో దాదాపు 1.7 లక్షల దరఖాస్తులు రాగా..రెండో సీజన్​కు అప్లికేషన్లు జోరందుకున్నాయి. ఏకంగా ఐదు లక్షల మంది ఈ పోటీలో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన రెండో సీజన్‌లో 95 శాతం నాణ్యమైన నిద్రతో విజేతగా నిలిచింది కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి. రూ. 5 లక్షల నగదు బహుమతిని అందుకున్న త్రిపర్ణా 'భారత తొలి స్లీప్‌ ఛాంపియన్‌'గా నిలిచింది. ఇక మిగతా ముగ్గురు ఫైనలిస్టులకు రూ. లక్ష చొప్పున అందజేశారు. దాదాపు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కాంపిటిషన్ ఇప్పుడు మూడో సీజన్​లోకి అడుగుపెట్టనుంది. మరీ మీరు కూడా ఈ కాంపిటిషన్​లో పాల్గొనాంటే www.wakefit.co లో లాగిన్ అయిపోయిండి మరి.

ఇదీ చదవండి: తెదేపా అంటే జగన్‌కు వణుకు.. అందుకే అక్రమ అరెస్టులు: చంద్రబాబు

ఆస్పత్రి నిర్లక్ష్యం.. నేలపైనే బాధితుడు.. కుక్క వచ్చి రక్తం నాకినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.