ETV Bharat / bharat

వైద్యుడిపై కులవివక్ష!.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్.. మేక కోసం తల్లి దారుణ హత్య - వైద్యుడు ఏడుస్తున్న వీడియో

వైద్యుడిపై ఆస్పత్రి వర్గాలు కులవివక్ష ప్రదర్శించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడి కులాన్ని సాకుగా చూపి వైద్యుడికి కనీసం కుర్చీ కూడా ఇవ్వడం లేదంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, ఉత్తరాఖండ్​లో ఉన్నతవర్గ మహిళను వివాహం చేసుకున్న దళితుడు హత్యకు గురయ్యాడు. తన అత్త, మామలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాజస్థాన్​లో.. మేకను విక్రయించిందన్న కోపంతో తల్లిని హత్య చేశాడు ఓ బాలుడు.

viral-video-of-doctor-crying-in-bhiwani
viral-video-of-doctor-crying-in-bhiwani
author img

By

Published : Sep 2, 2022, 8:39 PM IST

హరియాణా భివానీలో ఓ వైద్యుడు వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కుర్చీలో కూర్చొని పక్కన ఉన్నవారికి తన బాధలు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో కనిపిస్తున్న డాక్టర్ పేరు ధర్మేంద్ర అని సమాచారం. వీడియోలో వైద్యుడి వాయిస్ వినిపించడం లేదు. అయితే దాన్ని చిత్రీకరించిన వ్యక్తి వైద్యుడి కష్టాలను వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. భివానీ జనరల్ ఆస్పత్రిలో ధర్మేంద్ర పనిచేస్తున్నారు. ఆయనకు ఆస్పత్రిలో కూర్చునేందుకు స్థలం ఇవ్వడం లేదని, రోగులను చూడాలన్నా ధర్మేంద్రకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కులవివక్షతోనే ఇదంతా చేస్తున్నారని వీడియో తీసిన వ్యక్తి ఆరోపించారు.

వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్

'డాక్టర్ స్వస్థలం బిహార్. ఆ వైద్యుడు నిజాయతీపరుడే. కానీ ఆస్పత్రిలో కూర్చునేందుకు ఆయనకు కుర్చీ ఇ్వవడం లేదు. వైద్యుడి కులాన్ని చూసి వారు ఇలా చేస్తున్నారు. అందువల్ల డాక్టర్ తన రోగులకు వైద్యం చేయలేకపోతున్నారు. మనోవేదన ఎక్కువై ఒక్కసారిగా ఏడ్చేశారు' అని వీడియో తీసిన వ్యక్తి చెప్పారు. ఈ ఘటనపై ఆస్పత్రి అధికారులకు వైద్యుడు ధర్మేంద్ర ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, కులవివక్ష కారణంగానే వైద్యుడిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియలేదు.

మరోవైపు, భివానీ సివిల్ ఆస్పత్రి పీఎంఓ, డాక్టర్ ఎడ్విన్ రంగా దీనిపై భిన్నంగా స్పందించారు. ఆస్పత్రి సిబ్బందితో ధర్మేంద్ర అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆపరేషన్ థియేటర్​కు వెళ్లి వైద్యులు, సిబ్బంది పట్ల తప్పుగా ప్రవర్తించారని, వారిని తిట్టాడని చెప్పారు. ధర్మేంద్రపై మరో వైద్యుడు మనీశ్ షియోరన్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దళితుడి హత్య
ఉత్తరాఖండ్ అల్మోడాలో కులవివక్ష కోరలు చాచింది. ఉన్నత వర్గానికి చెందిన మహిళను పెళ్లాడినందుకు ఓ దళితుడి(39)ని తన అత్తింటి వ్యక్తులు హత్య చేశారు. కారులో మృతదేహాన్ని తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుపడ్డారు.

'పనువాదోఖాన్ గ్రామానికి చెందిన దళిత రాజకీయ కార్యర్త జగ్దీశ్ చంద్ర.. ఆగస్టు 21న ఉన్నత వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తున్న అతడి అత్తింటివారు గురువారం జగ్దీశ్​ను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలోనే జగ్దీశ్ శుక్రవారం భికియాసైన్ పట్టణంలో ఓ కారులో విగతజీవిగా కనిపించాడు. జగ్దీశ్ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా అతడి భార్య తల్లి, సవతి తండ్రి, సవతి సోదరుడు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని వెంటనే అరెస్టు చేశాం' అని సాల్ట్ సబ్​డివిజన్ తహసీల్దార్ నిషా రాణి తెలిపారు. మృతుడి శరీరంపై 25 గాయాలు అయ్యాయని, రాడ్డుతో కొట్టినట్లు కనిపిస్తోందని నిషా రాణి వెల్లడించారు.

తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆగస్టు 27న దంపతులు జిల్లా అధికారులకు లేఖ రాశారని ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ నేత పీసీ తివారి పేర్కొన్నారు. బాధితుడు సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు తమ పార్టీ తరఫున పోటీ చేశాడని తివారి వెల్లడించారు. 'జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఉంటే జగ్దీశ్ బతికుండేవాడు. ఈ హత్య ఉత్తరాఖండ్​కు సిగ్గుచేటు. బాధితుడి భార్యకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి' అని తివారి డిమాండ్ చేశారు.

మేక కోసం తల్లి హత్య
రాజస్థాన్ ఝలావర్​లో దారుణం జరిగింది. మేక కోసం కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. 12వ తరగతి చదువుతున్న నిందితుడు.. మేకను విక్రయించిందన్న కోపంతో తల్లిని హత్య చేశాడు. సునేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేమ్లియా గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలిని నోదయాన్​బాయి మేఘవాల్(40)గా పోలీసులు గుర్తించారు.

'బాలుడు తన తల్లిని పదునైన ఆయుధంతో చంపేశాడు. మృతురాలి తల, శరీర భాగాలపై లోతైన గాయాలయ్యాయి. హత్య చేసిన తర్వాత బాలుడు తన తల్లి మృతదేహాన్ని దుప్పటిలో కప్పేసి, ఇంట్లోని ఓ డబ్బాలో దాచేశాడు. బాలుడి తండ్రి తన పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న తర్వాత తన భార్య గురించి కొడుకును అడిగాడు. పొలానికి వెళ్లిందని నిందితుడు తన తండ్రికి అబద్దం చెప్పాడు. చుట్టపక్కల వారంతా బాధితురాలి కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోయే సరికి.. ఆ తర్వాత తండ్రి గట్టిగా అడిగేసరికి నిందితుడు హత్య చేసిన విషయాన్ని ఒప్పేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసుకొని స్థానిక ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నాం. అతడి వయసును ఇంకా నిర్ధరించలేదు' అని సునేల్ పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి దినేశ్ కుమార్ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి:
బర్త్​డే పార్టీకి వచ్చి గొడవ.. భవనం పైనుంచి తోసేసి హత్య.. 9ఏళ్ల బాలికపై వృద్ధుల రేప్
బర్త్​డే వేడుకల్లో డాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. అక్కడికక్కడే మృతి
ఫేమస్​ అయ్యేందుకు ఐదుగురిని హత్య చేసిన యువకుడు.. నెక్ట్స్​ టార్గెట్​ పోలీసులేనట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.