ETV Bharat / bharat

అత్యాచారానికి గురైన బాలికతో నిందితుడి పెళ్లి.. హైకోర్టు స్పెషల్ బెయిల్!

అత్యాచారం చేసిన బాలికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఓ నిందితుడు. ఇందుకోసం ప్రత్యేకంగా బెయిల్​ ఇవ్వమని కోర్టును కోరగా.. షరతులతో కూడిన ఆరు వారాల స్వల్వకాలిక బెయిల్​ను మంజూరు చేసింది ఉత్తరాఖండ్​ హైకోర్టు.

Uttarakhand High Court Decision
ఉత్తరాఖండ్ హైకోర్టు
author img

By

Published : Jan 31, 2023, 10:15 PM IST

Updated : Jan 31, 2023, 10:48 PM IST

అత్యాచార బాధితురాలితో వివాహం కోసం జైలులో ఉన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది ఉత్తరాఖండ్ హైకోర్టు. మైనర్​ను వివాహం చేసుకునేందుకు 24 ఏళ్ల నిందితుడికి ఆరు వారాల స్వల్ప కాలిక బెయిల్ జారీ చేసింది. బాధితురాలిపై గతంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఆమె 2021 సెప్టెంబర్​లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా బాధితురాలికి మైనారిటీ తీరడం వల్ల ఆమెను పెళ్లి చేసుకునెందుకు సిద్ధమయ్యాడు నిందితుడు. ఇందుకోసం అనుమతినివ్వాలని కోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన ఆరు వారాల బెయిల్​ను మంజూరు చేసింది.

అసలేం జరిగిందంటే..
2021 జనవరిలో నైనీతాల్​కు చెందిన 15 ఏళ్ల బాలికపై చంపావత్​ జిల్లాకు చెందిన యువకుడు అత్యాచారం చేసి తల్లిని చేశాడనే ఆరోపణలతో 2021 సెప్టెంబర్ 13న నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబరులో బాధిత గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఘటన జరిగిన సమయానికి బాధితురాలు మైనర్​ అని ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు నిండాయని, దీంతో ఇద్దరికి వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి.

ఇందుకోసం నిందితుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు జిల్లా కోర్టులో బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఇరు వర్గాల వాదనలు వింటున్న సమయంలో బాధితురాలు 2021 జనవరిలో పరస్పర అంగీకారంతోనే నిందితుడితో శృంగారంలో పాల్గొన్నానని అందువల్లే తనకు గర్భం వచ్చిందని కోర్టుకు వివరించింది. ఇది విన్న జిల్లా కోర్టు బెయిల్​ అప్పీల్​ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. జనవరి 25న షరతులతో కూడిన ఆరు వారాల స్వల్పకాలిక బెయిల్​ను మంజూరు చేసింది. బెయిల్​ గడువు ముగిసిన తర్వాత వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని అనంతరం పోలీసులకు లొంగిపోవాలని హైకోర్టు పేర్కొంది. కాగా 2021లో చంపావత్​లోని రీతా సాహిబ్​ పోలీస్​ స్టేషన్​లో నిందితుడిపై ఎఫ్​ఐఆర్​ నమోదు అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసి సెక్షన్​ 376తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చసి అరెస్టు చేశారు.

Last Updated : Jan 31, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.