ఉత్తరాఖండ్ జోషీమఠ్‌లో(Joshimath) భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది. ఆదివారం ఉదయం 5.58 గంటలకు జోషీమఠ్‌కు 31 కిలోమీటర్ల దూరంలో.. భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది.
ఐదు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఇవీ చూడండి: