ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై (priyanka gandhi up elections) హామీల వర్షం కురిపిస్తున్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తాజాగా మరో ప్రకటన చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు ప్రియాంక సోమవారం ట్వీట్ చేశారు.
-
कोरोना काल में और अभी प्रदेश में फैले बुखार में सरकारी उपेक्षा के चलते उप्र की स्वास्थ्य व्यवस्था की जर्जर हालत सबने देखी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
सस्ते व अच्छे इलाज के लिए घोषणापत्र समिति की सहमति से यूपी कांग्रेस ने निर्णय लिया है कि सरकार बनने पर
'कोई भी हो बीमारी
मुफ्त होगा 10 लाख तक इलाज सरकारी।' pic.twitter.com/wJbTZXbjmk
">कोरोना काल में और अभी प्रदेश में फैले बुखार में सरकारी उपेक्षा के चलते उप्र की स्वास्थ्य व्यवस्था की जर्जर हालत सबने देखी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2021
सस्ते व अच्छे इलाज के लिए घोषणापत्र समिति की सहमति से यूपी कांग्रेस ने निर्णय लिया है कि सरकार बनने पर
'कोई भी हो बीमारी
मुफ्त होगा 10 लाख तक इलाज सरकारी।' pic.twitter.com/wJbTZXbjmkकोरोना काल में और अभी प्रदेश में फैले बुखार में सरकारी उपेक्षा के चलते उप्र की स्वास्थ्य व्यवस्था की जर्जर हालत सबने देखी।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2021
सस्ते व अच्छे इलाज के लिए घोषणापत्र समिति की सहमति से यूपी कांग्रेस ने निर्णय लिया है कि सरकार बनने पर
'कोई भी हो बीमारी
मुफ्त होगा 10 लाख तक इलाज सरकारी।' pic.twitter.com/wJbTZXbjmk
"రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రజలకు తక్కువ ధరకు, నాణ్యమైన వైద్యం అందించే దిశగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. మమ్మల్ని గెలిపిస్తే ఏ రోగానికి సంబంధించిన వైద్యమైనా రూ. 10 లక్షల వరకు ఉచితంగా అందిస్తాం."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
యూపీలోని బారబంకీ జిల్లాలో శనివారం ప్రతిజ్ఞ యాత్రను (priyanka gandhi up elections) ప్రారంభించిన ప్రియాంక.. నవంబర్ 1 వరకు పర్యటనను కొనసాగించనున్నారు.
ఇప్పటికే అన్నదాతల రుణాల మాఫీ సహా.. వరి, గోధుమకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు.
విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్న ప్రియాంక.. బాలికలకు ఉచిత ఈ-స్కూటీ, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి : యూపీలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోదీ