ETV Bharat / bharat

ఎన్నికల కోసం పెళ్లి.. నామినేషన్‌కు ముందు ఏడడుగులు.. భార్యకు పదవి గిఫ్ట్! - ఉత్తరప్రదేశ్ మునిసిపల్ ఎన్నికలు 2023

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ వ్యక్తి పెళ్లి పీటలెక్కాడు. అనంతరం భార్యతో నామినేషన్ వేయించాడు. రిజర్వేషన్లలో భాగంగా వార్డు స్థానాన్ని మహిళలకు కేటాయించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు. నామినేషన్​కు గడువు ముగిసే కొన్ని గంటలకు ముందు.. వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

up-pilibhit-municipality-elections-2023-former-councilor-married-to-contest-elections
నామినేషన్‌కు ముందు పెళ్లి చేసుకున్న మాజీ కౌన్సిలర్​
author img

By

Published : Apr 22, 2023, 9:39 AM IST

ఆ వ్యక్తి ఓ వార్డుకు​ మాజీ కౌన్సిలర్​. ఆ వార్డు నుంచి మరోసారి కౌన్సిలర్​గా పోటీ చేయాలని భావించాడు. అయితే అతని ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ఆ స్థానాన్ని మహిళలకు రిజర్వ్​ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయానికి ఇంకా పెళ్లి చేసుకోని కౌన్సిలర్.. అధికారుల నిర్ణయంతో కంగుతిన్నాడు. ఇక చేసేదేం లేక ఎన్నికల కోసం పెళ్లి చేసుకున్నాడు. నామినేషన్ గడువు ముగిసే కొన్ని గంటల ముందు ఓ ఇంటి వాడయ్యాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

పీలీభీత్ మున్సిపల్ కౌన్సిల్​కు మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అవతార్​ సింగ్​ అనే వ్యక్తి.. పట్టణంలోని 16 వార్డు నుంచి చివరిసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. మళీ అదే స్థానం నుంచి కౌన్సిలగా బరిలోకి దిగాలని భావించాడు. వార్డు ప్రజలు కూడా అవతార్​ సింగ్​ పోటీలో నిలవాలని ఆకాక్షించారు. కానీ అ స్థానం మహిళలకు రిజర్వ్​ కావడం వల్ల అందరూ కాస్త నిరాశకు గురయ్యాడు. కనీసం తన కుటుంబ సభ్యుల్లో ఎవరినైన పోటీలో నిలపాలని అవతార్​ సింగ్​కు.. వార్డు ప్రజలు సూచించారు. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు, ప్రజల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు అవతార్ సింగ్. ఈ వేడుకకు మాజీ వార్డ్​ కౌన్సిలర్స్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి చుట్టుపక్క ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. తన భార్యను ఎన్నికల్లో పోటీకి నిలిపి.. ఆమెకు కౌన్సిలర్​ పదవిని కానుకగా ఇస్తానని అవతార్ సింగ్​ తెలిపాడు.

up pilibhit municipality elections 2023 former councilor married to contest elections
నామినేషన్‌కు ముందు పెళ్లి చేసుకున్న మాజీ కౌన్సిలర్​
up pilibhit municipality elections 2023 former councilor married to contest elections
నామినేషన్‌కు ముందు పెళ్లి చేసుకున్న మాజీ కౌన్సిలర్​

పదవి కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లి..
వారం రోజుల క్రితం ఇలాంటి సంఘటనే ఉత్తర్​ప్రదేశ్​లో రాష్ట్రంలోని రాంపుర్​ మున్సిపాలిటీలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మామూన్​ షా ఖాన్ అనే వ్యక్తి.. 45 ఏళ్ల వయస్సులో పెళ్లి పీటలెక్కాడు. మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం ఈ పెళ్లి చేసుకున్నాడు. ఎన్నికలకు చాలా రోజుల నుంచి కసరత్తులు ప్రారంభించిన అతనికి.. అధికారులు షాక్​ ఇచ్చారు. ఆ స్థానాన్ని మహిళలకు రిజర్వ్​ చేస్తు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నిరాశకు గురైన ఆ వ్యక్తి చేసేది లేక.. పెళ్లి చేసుకుని భార్యను పోటీలో నిలిపాడు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ వ్యక్తి.. పదవిపై ప్రేమతో ఏప్రిల్​ 15న ఘనంగా వివాహం చేసుకున్నాడు. కేవలం 45 గంటల్లోనే పెళ్లి తతంగమంతా పూర్తి చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.