UP assembly election 4th phase: ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
![up election 2022 forth phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14542493_fmpvabgagaezet4-3.jpg)
![up election 2022 forth phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14542493_fmpvabgagaezet4-2.jpg)
UP 4th phase Mayawati vote
బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే.. లఖ్‌నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్‌కు చేరుకున్న మాయావతి.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.
![up election 2022 forth phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14542493_fmpvabgagaezet4-4.jpg)
![up election 2022 forth phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14542493_fmptxe6aqaalvn5.jpg)
లఖ్‌నవూ జిల్లాతో పాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్ జరగనుంది. జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ నాల్గో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.
![up election 2022 forth phase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14542493_fmpvabgagaezet4-1.jpg)
- 2.3కోట్లు: ఈ నియోజకవర్గాల్లో ఓటర్లు
- 13,817: పోలింగ్ కేంద్రాలు
- 24,643: పోలింగ్ బూత్‌ల సంఖ్య
గత ఎన్నికల్లో ఇలా..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59స్థానాల్లో భాజపానే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్ ఒకచోట గెలుపొందాయి.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే