ETV Bharat / bharat

పెళ్లి కోసం 4 గంటల పెరోల్​.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు.. - బాధితురాలని పెళ్లి చేసుకున్న అత్యాచార నిందితుడు

అత్యాచార ఆరోపణలతో జైలులో ఉన్న ఓ యువకుడు.. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్​పై విడుదయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ బాధితురాలే పెళ్లికూతురు. బిహార్​లో ఈ ఘటన జరిగింది.

unique-wedding-in-bihar-rape-accused-gets-4-hours-parole-for-wedding
బాధితురాలని పెళ్లి చేసుకున్న అత్యాచార నిందితుడు
author img

By

Published : Mar 25, 2023, 10:49 PM IST

బిహార్​లో ఓ వింత వివాహం జరిగింది. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్​పై విడుదయ్యాడు ఓ యువకుడు. అత్యాచారం కేసులో జైలులో ఉన్న ఆ యువకుడు.. బయటకు వచ్చి బాధితురాలినే పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. 20 రోజుల క్రితం అత్యాచారం కేసులో జైలుకెళ్లిన యువకుడు.. బాధితురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ప్రస్తుతం ఈ పెళ్లి చుట్టుపక్క ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదీ జరిగింది
ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి పేరు.. రాహుల్​ కుమార్​. ఇతడు బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన వ్యక్తి. రాహుల్​ కుమార్​ హజీపుర్​లో ఇంజనీరింగ్​ చదివాడు. బాధిత యువతి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అమ్మాయి. వీరిద్దరు మంచి స్నేహితులు. కొద్ది రోజుల తరువాత వీరి స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మార్చి 4వ తేది వీరిద్దరు గోపాల్​ గంజ్​లోని ఓ గుడికి వెళ్లారు. రోజంతా జాలీగా తిరిగారు. అనంతరం ఆ రోజు రాత్రి రాహుల్​ కుమార్​ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. ప్రైవేటు భాగంలో రక్తస్త్రావం కూడా అయింది.

దీంతో మరుసటి రోజు ఉదయం యువతిని.. గోపాల్​ గంజ్​లోని సదర్​ ఆసుపత్రికి తీసుకెళ్లాడు రాహుల్​. యువతి పరీక్షించిన అక్కడి వైద్యులకు అనుమానం వచ్చింది. యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. రాహుల్​పై అత్యాచార ఆరోపణలతో అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు.

పెరోల్​ కోసం కోర్టుకెళ్లిన రాహుల్​..
అయితే జైలులో ఉన్న రాహుల్​.. పెరోల్​ కోసం కోర్టుకు వెళ్లాడు. తాను యువతిపై అత్యాచారం చేయలేదని.. తామిద్దరం ప్రేమలో ఉన్నామని కోర్టుకు తెలిపాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని.. అందుకు పెరోల్​ కావాలని న్యాయస్థానాన్ని కోరాడు. యువకుడు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. నాలుగు గంటల పాటు రాహుల్​కు పెరోల్​ మంజూరు చేసింది.

రాహుల్ విడుదలకు కుటుంబ సభ్యుల డిమాండ్​..
రాహుల్​ను విడుదల చేయాలని అతడి కుటుంబ సభ్యుల కోరుతున్నారు. రాహుల్​ సదరు యువతిపై అత్యాచారం చేయలేదని.. వారిద్దరు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. రాహుల్ శిక్షను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. వారిద్దరు మేయర్లని, వారికి ప్రేమిచుకునే హక్కు, పెళ్లి చేసుకునే అర్హత ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు బాధితురాలిని రాహుల్​ పెళ్లి చేసుకున్నాడని.. అందుకైనా అతడిని విడుదల చేయాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.