ETV Bharat / bharat

23 ఏళ్ల యువతితో 65 ఏళ్ల వ్యక్తి రెండో పెళ్లి.. ఆరుగురు కూతుర్లతో డీజే టిల్లు స్టెప్పులు! - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

భార్య మృతి చెందిన తర్వాత.. తన ఆరుగురు కుమార్తెలకు ఘనంగా పెళ్లిళ్లు చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఒంటరి జీవితం గడిపాడు. తీవ్ర మనస్తాపానికి గురై.. ఇటీవలే 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఊరేగింపులో ఆరుగురు కుమార్తెలతో కలిసి డీజే పాటలకు హుషారుగా డ్యాన్స్​ చేశాడు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే?

65 year old man having six daughters married 23 year girl

author img

By

Published : Feb 6, 2023, 9:29 AM IST

Updated : Feb 6, 2023, 10:07 AM IST

23 ఏళ్ల యువతితో 65 ఏళ్ల వ్యక్తి రెండో పెళ్లి.. ఆరుగురు కూతుర్లతో డీజే టిల్లు స్టెప్పులు!

65 ఏళ్ల వ్యక్తి.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అంతే కాకుండా పెళ్లి ఊరేగింపులో తన ఆరుగురు కుమార్తెలతో డీజే పాటలకు హుషారుగా డ్యాన్స్​లు కూడా చేశాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగిందీ సంఘటన.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హుసైనాబాద్​ పూరే చౌధరి గ్రామానికి చెందిన నఖేద్​ యాదవ్​కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఆరుగురు కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత అతడి భార్య చనిపోయింది. కష్టపడి కుమార్తెలను పెంచి పెళ్లిళ్లు చేశాడు.

65 year old man having six daughters married 23 year girl
ఊరేగింపులో రెండో భార్యతో నఖేద్​

అప్పటి నుంచి నఖేద్​ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కుటుంబసభ్యుల అంగీకారంతో రుదౌలీ ప్రాంతంలో కామాఖ్యదేవి ఆలయంలో 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి.

డ్యాన్స్​ చేస్తున్న నఖేద్​

పెళ్లి తర్వాత బరాత్​ కూడా ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో నఖేద్​ ఆరుగురు కుమార్తెలు, బంధువులు హుషారుగా నృత్యాలు చేశారు. 65 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకుగా మారిన నఖేద్​ కూడా జోరుగా డ్యాన్స్​ చేశాడు. ప్రస్తుతం వీరి డ్యాన్స్​కు సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

డ్యాన్స్​ చేస్తున్న నఖేద్​ ఆరుగురు కుమార్తెలు

Last Updated : Feb 6, 2023, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.