ETV Bharat / bharat

'బరువు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్లు ఇస్తానన్నారు..' - Nitin Gadkari challenges Ujjain MP MP Anil Firojiya

Ujjain MP Anil Firojiya: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఎంపీ, భాజపా నేత అనిల్‌ ఫిరోజియా.. తన నియోజకవర్గ నిధుల కోసం వర్కౌట్లతో చెమటోడుస్తున్నారు. డైట్‌, వ్యాయామం, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌లు చేసి బరువు తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నారు. అదేంటీ.. నియోజకవర్గ నిధులకు, బరువు తగ్గడానికి సంబంధం ఏంటా అనుకుంటున్నారా? అంతా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సవాల్‌ పుణ్యమే..! అసలేం జరిగిందంటే..

Ujjain MP MP Anil Firojiya
Ujjain MP MP Anil Firojiya
author img

By

Published : Jun 12, 2022, 4:13 AM IST

Updated : Jun 12, 2022, 10:53 AM IST

Ujjain MP Anil Firojiya: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్​ రాష్ట్రం ఉజ్జయినిలోని మాల్వా ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అధిక బరువుతో ఉన్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారట. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. ఇందుకోసం ఎంపీకి ఓ సవాల్‌ కూడా విసిరారు. ‘‘తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ అనిల్‌ తరచూ నన్ను డిమాండ్‌ చేస్తుంటారు. అయితే, అందుకు ఆయనకు నేనే షరతు పెట్టాను. నేను కూడా గతంలో 135 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 93 కేజీలకు తగ్గాను. నా పాత ఫొటో కూడా చూపించాను. నా కండిషన్‌ ఏంటంటే.. ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే మీరు బరువు తగ్గాలి. ఎన్ని కేజీలు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తాను’’ అని గడ్కరీ స్టేజీ మీదే చెప్పారు.

దీంతో అప్పటి నుంచి అనిల్‌ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. యోగా, ఫిజికల్ వర్కౌట్లు, స్విమ్మింగ్‌ వంటివి చేస్తున్నారు. ఫిబ్రవరిలో 127 కేజీలున్న అనిల్‌.. ఈ మూడు నెలల్లో 15 కేజీలకు తగ్గి 112 కేజీలకు చేరారట. త్వరలోనే 100 కేజీల దిగువకు బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. '‘కేంద్రమంత్రి గడ్కరీ సవాల్‌ను నేను స్వీకరించి 15 కేజీలు తగ్గాను. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆయనను కలిసి నా బరువు వివరాలు చెబుతాను. ఆయన తన మాట నిలబెట్టుకుని రూ.15వేల కోట్ల నిధులను మా నియోజకవర్గానికి మంజూరు చేస్తారని ఆశిస్తున్నా'’’ అని ఎంపీ అనిల్‌ ఫిరోజియా చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: 'మహా'లో తగ్గిన కేసులు.. దిల్లీలో 4.11శాతానికి పాజిటివిటీ రేటు

Last Updated : Jun 12, 2022, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.