ETV Bharat / bharat

UIDAI Warning : ఆధార్‌ యూజర్స్​కు వార్నింగ్‌.. వాట్సాప్​లో అలా చేస్తే..

author img

By

Published : Aug 19, 2023, 11:59 AM IST

UIDAI Warning To Aadhaar Users : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఆధార్‌ కార్డు హోల్డర్లను హెచ్చరించింది. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్​ కోసం పత్రాలను షేర్ చేయవద్దని సూచించింది.

UIDAI Warning To Aadhaar Users
UIDAI Warning To Aadhaar Users

UIDAI Warning To Aadhaar Users : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఎప్పటికప్పుడు ఆధార్​ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కొన్నిరోజుల క్రితం.. పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్డేట్​ చేసుకోమని యూఐడీఏఐ సూచించింది. దీంతో కొందరు దగ్గర్లోని ఆధార్​ సెంటర్​కు వెళ్లి అప్డేట్​ చేసుకుంటుండగా.. మరికొందరు ఆన్​లైన్​లో తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే సైబర్​ నేరగాళ్లు.. ఆధార్‌ అప్డేట్​ మాటున పంజా విసురుతున్నారట. దీంతో అప్రమత్తమైన UIDAI.. ఆధార్‌ కార్డు హోల్డర్లకు వార్నింగ్‌ ఇచ్చింది. ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును అప్డేట్​ కోసం పత్రాలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.

'UIDAI అలా ఎప్పుడూ కోరదు'
UIDAI Warns Users : "UIDAI ఎప్పుడూ ముఖ్యమైన డాక్యుమెంట్లను షేర్ చేయమని అడగదు. మీ ఆధార్‌ను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అప్డేట్​ చేయడానికి మీ POI/POA పత్రాలను షేర్ చేయమని మిమ్మల్ని ఎప్పుడూ కోరదు. my Aadhaar Portal ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్డేట్​ చేసుకోండి లేదా మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాలను సందర్శించండి" అని UIDAI సూచించింది.

'నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే'
Aadhaar New Rules 2023 : గతేడాది ప్రారంభంలో.. ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని UIDAI.. ప్రజలు తమ ఆధార్​ కార్డుల ఫొటో కాపీలను ఏ సంస్థలతోనూ పంచుకోవద్దని సూచించింది. "ఆధార్ కార్డులో దుర్వినియోగం అయ్యే సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంది. కాబట్టి ప్రజలు తమ ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను మాత్రమే ప్రదర్శించేలా ఉపయోగించకోవచ్చు" అని పేర్కొంది.

'సోషల్​మీడియాలో ఆధార్​ ఫొటో పోస్ట్​ చేయొద్దు'
Aadhaar Updates : అయితే ఆధార్ కార్డును వివిధ లావాదేవీల్లో వాడుకోవచ్చని.. కానీ ట్విట్టర్​ (ఇప్పుడు ఎక్స్​), ఫేస్​బుక్​ వంటి సోషల్​మీడియా ఫ్లాట్​ఫామ్​లలో పోస్ట్​ చేయకూడదని UIDAI సూచించింది. ఆధార్‌ను ఉపయోగిస్తున్నప్పుడు శ్రద్ధ వహించాలని పేర్కొంది. 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డులను పొంది.. వివరాలను అప్డేట్​ చేసుకోని వ్యక్తులు వీలైనంత త్వరగా అప్డేట్​ చేసుకోవాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.