ETV Bharat / bharat

'ఆధార్'​ రూల్స్ బ్రేక్ చేస్తే రూ.కోటి జరిమానా! - ఆధార్‌ ప్రాధికార సంస్థ తాజా వార్తలు

ఆధార్‌ చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(యూఐడీఏఐ)కు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

UIDAI
యూఐడీఏఐ
author img

By

Published : Nov 3, 2021, 5:51 PM IST

దేశంలో ఆధార్‌ వినియోగంలో ఉల్లంఘనలు జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ వ్యవస్థను నిర్వహిస్తోన్న ఆధార్‌ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు ఆధార్‌ చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

చర్యలేంటి..?

కేంద్రం ఇచ్చిన అధికారంతో 'ఉడాయ్‌' సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఫిర్యాదుల పరిశీలనకు న్యాయధికారులను నియమించుకునే అధికారం ఉడాయ్‌కే ఉంటుంది. న్యాయాధికారులు విధించిన జరిమానాలపై అప్పీలు చేసుకోవాలంటే టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్‌ అప్పీలేట్‌ అథారిటీగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

దీనికి సంబంధించిన చట్టాన్ని రెండేళ్ల క్రితమే ఆమోదించగా తాజాగా అందుకు వీలు కల్పించే నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఇదీ చూడండి: విద్య.. వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.