రాజద్రోహం కేసులు నమోదు చేయటానికి వీలు కలిగిస్తున్న 'సెక్షన్ 124ఏ' రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో దావా దాఖలైంది. షిల్లాంగ్ టైమ్స్ సంపాదకురాలు ప్యాట్రికా ముఖిం, కశ్మీర్ టైమ్స్ యజమానురాలు అనురాధా భాషిన్లు దీనిని వేశారు.
ఈ సెక్షన్ కింద శిక్షలు వేయటానికి ఎలాంటి చట్టపరమైన మార్గదర్శకాలు లేవని, జడ్జీలకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టారని తెలిపారు.
మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్యోద్యమకారులపై ప్రయోగించిన బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టం దుర్వినియోగమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది.
ఇదీ చదవండి : 'ఐదేళ్లలో 326 రాజద్రోహం కేసులు- శిక్ష పడింది ఆరుగురికే!'