ETV Bharat / bharat

డ్రగ్స్​కు బానిసై.. 12 వాహనాలను ధ్వంసం చేసిన యువకుడు - ప్రయాణికులపై దాడి చేసిన యువకులు

డ్రగ్స్​కు బానిసైన ఓ యువకుడు కేరళ బలరాంపురలోని పలు వాహనాలను ధ్వంసం చేశాడు. పార్కింగ్​లో ఉన్న సుమారు 12 వాహనాల అద్దలను పగలకొట్టాడు. అతనితో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు.

gang smashes 12 vehicles
వాహనాలను ధ్వంసం చేసిన యువకుడు అరెస్ట్​
author img

By

Published : Dec 21, 2021, 12:19 PM IST

పార్కింగ్​లో ఉన్న వాహనాలను ధ్వంసం చేసిన యువకుడు అరెస్ట్​

కేరళ తిరువనంతపురంలోని బలరాంపురలో ఓ వ్యక్తి.. వాహనాలను ధ్వంసం చేసే పనిలో పడ్డాడు. మరో వ్యక్తి సహాయంతో.. ఇప్పటివరకు సుమారు 12కుపైగా వాహనాలను ధ్వంసం చేశాడు. డ్రగ్స్​కు బానిసైన మిథున్​ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడే దాడులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు.

నిందితులు.. బలరాంపురం, ఎరుత్తవుర్​, రూస్సెల్​పురంల్లో పార్క్​ చేసి ఉంచిన తొమ్మిది లారీలు, మూడు కార్లు, నాలుగు బైక్​ల అద్దాలను పగల గొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఎరుత్తవుర్​లోని అను షాపు ముందు ఉంచిన హోండా యాక్టివాను వీరు పూర్తిగా ధ్వసం చేశారు. మరో కారు అద్దాలు పగల కొట్టేటప్పుడు జయ చంద్రన్​ అనే వ్యక్తి వాహనంలో ఉండడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. షీబా కుమారి అనే మహిళపైనా దాడి చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: 'స్లమ్ గర్ల్' ర్యాప్​.. సోషల్​ మీడియాలో యమ హైప్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.