ETV Bharat / bharat

రెండు కార్లు ఢీ.. ఐదుగురు దుర్మరణం.. టూరిస్ట్​ బస్సు ప్రమాదంలో మరో 35 మంది.. - మండ్య రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరోవైపు, టూరిస్ట్ బస్సును లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా.. మరో 35 మంది గాయపడ్డారు.

Car accident
కారు ప్రమాదం
author img

By

Published : Dec 12, 2022, 4:07 PM IST

Karnataka Accident: కర్ణాటక మండ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగమంగళ సమీపంలోని బెంగళూరు నుంచి మంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వెళ్తున్న ఇన్నోవా, స్విఫ్ట్​ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా కారులో ఉన్న కృష్ణమూర్తి (66), ఆయన భార్య జయంతి (60), డ్రైవర్ ప్రభాకర్​ను మృతులుగా పోలీసులు గుర్తించారు. హసన్​ నుంచి స్విఫ్ట్​ కారులో వస్తున్న మరో ఇద్దరు మరణించినట్లు తెలిపారు. బిండిగనవిలే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నారు.

టూరిస్ట్ బస్సును ఢీకొట్టిన లారీ..
టూరిస్ట్ బస్సును ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటన బిహార్​లోని కైమూర్​లో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా.. అందులో ఉన్న 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కుద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. టూరిస్ట్ బస్సు బంగాల్​ నుంచి ఆగ్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.

two cars collide with each other
టూరిస్ట్ బస్సును ఢీకొట్టిన లారీ

ప్రమాదానికి గురైన మినీ బస్సు..
కేరళ కోజికోడ్​లో​ రోడ్డు ప్రమాదం జరిగింది. వడకర కుంజిపల్లి జాతీయ రహదారిపై పికప్ వ్యాన్​ను అయ్యప్ప యాత్రికులతో వెళ్తున్న మినీబస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది యాత్రికులు, పికప్ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డాడు. క్షతగాత్రులందరినీ కోజికోడ్​లోని ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులను క్షతగాత్రులుగా పోలీసులు గుర్తించారు.

two cars collide with each other
పికప్​ వ్యాన్​ను ఢీకొట్టిన బస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.