Tution Teacher thrashed: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ టీచర్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలితో అనుచితంగా వ్యవహరించాడు. ఈ విషయం తెలుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహువా పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు నివసిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రవి విజయ్ కుమార్ అనే ట్యూషన్ టీచర్.. విద్యార్థినితో అనుచితంగా మెలిగాడు. ఆ తర్వాత బాధితురాల్ని పట్టించుకోలేదు. బాలిక.. నిందితుడ్ని నిలదీయడం వల్ల ఆమె మొబైల్‌ను పగలగొట్టాడు. చంపుతానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు తన అక్కకు జరిగిన దారుణాన్ని చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు.. ట్యూషన్ టీచర్‌తో గొడవకు దిగి నిందితుడిని చితకబాదారు. రోడ్డుపై లాక్కెళ్లి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై మహువా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలిపై స్నేహితులతో కలిసి..
20 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు సహా నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ప్రియురాలితో సన్నిహితంగా మెలుగుతూ వీడియోను తీశాడు ప్రియుడు. ఈ వీడియోతో యువతిని బ్లాక్మెయిల్ చేసి ముగ్గురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు కాంకేర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం, శిశువు మృతి, ఆ నిర్లక్ష్యంతోనే
ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్ నుంచి మెసేజ్