ETV Bharat / bharat

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - మార్చి నెల ఆర్జిత‌ సేవా టికెట్ల షెడ్యూల్ రిలీజ్! - TTD March 2024 Tickets Schedule

TTD March 2024 Tickets Schedule: 2024 మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటాకు సంబంధించి షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. మరి ఏయే తేదీల్లో.. ఏ టికెట్లను బుక్‌ చేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

TTD March 2024 Tickets Schedule
TTD March 2024 Tickets Schedule
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 10:20 AM IST

Tirumala Seva Tickets For March 2024 : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టాలని ఎంతో మంది భక్తులు కోరుకుంటారు. స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండపైకి వస్తుంటారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. తాజాగా మార్చిలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. 2024 మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా, రూ.300 దర్శనం టికెట్ల కోటాకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది. మరి ఏయే తేదీల్లో ఏయే టికెట్లను టీటీడీ విడుదల చేస్తోందనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మార్చి నెలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు :

  • శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్​ కోసం ఆన్​లైన్​ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబ‌ర్ 18 తేదీన (సోమవారం) ఉద‌యం 10 నుంచి డిసెంబ‌ర్ 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు ల‌క్కీడిప్ కోసం ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవచ్చు.
  • డిసెంబ‌ర్ 21 తేదీన (గురువారం) ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా, శ్రీ‌వారి తెప్పోత్స‌వాల టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు.
  • డిసెంబ‌ర్ 21వ తేదీన (గురువారం) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు.
  • డిసెంబ‌ర్ 23వ తేదీన (శనివారం) ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. ఇదే రోజున ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు. అలాగే మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌ టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.
  • డిసెంబ‌ర్ 25వ తేదీన (సోమవారం) ఉద‌యం 10 గంట‌లకు రూ.300ల ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు. ఇదే రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.
  • డిసెంబ‌రు 27 తేదీన (బుధవారం) ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను విడుదల చేస్తారు. అలాగే అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.
  • https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు వంటివి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల‌ని భక్తులను టీటీడీ సూచించింది.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.