ETV Bharat / bharat

తలాక్ చెప్పిన భర్త.. అతడి మిత్రుడితో మహిళ కొత్త జీవితం.. 'పుష్ప'గా పేరు మార్చుకొని.. - ఉత్తరప్రదేశ్​లో ట్రిపుల్​ తలాక్​ కేసు

ప్రేమబంధంతో ఒక్కటైనప్పటికీ అనుమానంతో భార్యను ఇంటినుంచి గెంటేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆ మహిళ.. భర్త స్నేహితుడిని వివాహం చేసుకుంది. హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకొని 'పుష్ప'గా మారింది.

triple talaq wife married husband friend
bareilly woman married in hindu religion
author img

By

Published : Sep 25, 2022, 9:28 AM IST

Updated : Sep 25, 2022, 11:31 AM IST

తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ బంధంతో ముడిపడ్డారు. భార్యతో సన్నిహితంగా ఉండాల్సిన భర్త తరచూ ఆమెను అనుమానంతో వేధిస్తుండేవాడు. అన్నిటికి సహిస్తూ వస్తున్నా అతనికి అనుమానం తగ్గలేదు. ఆఖరికి ఆమెను వదిలించుకునేందుకు ట్రిపుల్​ తలాక్​ చెప్పాడు. ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. ఇప్పుడు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను మరెవరో కాదు ఆమె మొదటి భర్త స్నేహితుడే. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. శుక్రవారం హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకుంది.

bareilly woman married in hindu religion
హిందూ సంప్రదాయాం ప్రకారం వివాహం చేసుకుంటున్న పుష్ప

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్​ రాంపుర్​ జిల్లాకు చెందిన రుబీనా.. హల్ద్వానికి చెందిన షోయబ్​ను తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించడానికి షోయబ్​ కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ప్రేమ్‌పాల్‌ గంగ్వార్‌ పరిచయమయ్యాడు. ప్రేమ్​పాల్​ తరచూ ఇంటికి వస్తుండేవాడు. అలా రుబీనాకు దగ్గరయ్యాడు. షోయబ్​కు రుబీనాపై అనుమానం రావడం వల్ల తరచూ ఆమెను వేధిస్తుండేవాడు.

ఎవరితో మాట్లాడుతున్నావ్​ అని ఆరా తీస్తుండేవాడు. భార్యపై క్రమంగా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారడం వల్ల వారం రోజుల క్రితం రుబీనాకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. చేసేదేమి లేక రుబీనా తన ప్రియుడు ప్రేమ్​పాల్​ వద్దకు వెళ్లింది. వారిద్దరు కలిసి బరేలీకి చేరుకున్నారు. శుక్రవారం ప్రేమ్‌పాల్ గంగ్వార్‌ను రుబీనా వివాహం చేసుకుంది. అనంతరం 'పుష్ప'గా పేరు మార్చుకుంది.

ఇదీ చదవండి: 'విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు'.. గుడ్డిగా నమ్మితే అంతే సంగతి.. కేంద్రం హెచ్చరిక!

స్విమ్మింగ్​ పూల్​లో 'గర్బా' డ్యాన్స్.. సంప్రదాయ దుస్తులతో ఉత్సాహంగా..

Last Updated : Sep 25, 2022, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.