తమిళనాడు మదురై మరియమ్మన్ ఆలయంలో అపశ్రుతి జరిగింది. పూజ కోసం చేస్తున్న జావలో పడి ఓ వ్యక్తి మరణించాడు. పాలంగనాథం ప్రాంతంలోని ముత్తుమరియమ్మన్ ఆలయంలో తమిళ నెల ఆదిని పురస్కరించుకుని జులై 29న ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవతకు పాయసంను (గంజి, అంబలి) సమర్పిస్తారు. దీంతో ఆరు పెద్ద కుండల్లో తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న మురుగన్ అనే భక్తుడు మూర్చ వచ్చి గంజి పాత్రలో పడిపోయాడు. గంజి వేడిగా ఉండడం వల్ల మురుగన్ శరీరం పూర్తిగా కాలిపోయింది. ఆయన కేకలు విన్న భక్తులు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. చివరకు మురుగన్ను బయటకు తీసిన భక్తులు.. హుటాహుటిన మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు చెన్నైలో ఏసీ పేలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శ్యామ్ అనే వ్యక్తి పెరంబూరు మనవలన్ వీధిలో పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం ధనలక్ష్మీ అనే మహిళతో వివాహం జరిగింది. భార్య తన తల్లి ఇంటికి వెళ్లగా.. శ్యామ్ ఒక్కడే ఇంట్లో పడుకున్నాడు. శ్యామ్ తండ్రి పై అంతస్తులో పడుకోగా.. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించింది. వెంటనే కిందకు వచ్చి చూడగా.. ఇళ్లంతా పొగ కమ్మేసింది. బెడ్రూమ్ తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఏసీ పేలడం వల్ల కుమారుడు శ్యామ్ శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
'మంకీపాక్స్పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్పైనా ముందడుగు'
విమానం కిందకు దూసుకెళ్లిన కారు.. ముందు చక్రాల వరకు వెళ్లి...