ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే జైలుకే! - ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే జైలుకే!

ఆన్​లైన్​ రమ్మీ ఆటలో డబ్బు కోల్పోయి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించింది. ఇకనుంచి రమ్మీ ఆడితే ఆరు నెలలపాటు జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించనున్నట్టు తెలిపింది.

TN bans online gaming involving betting
ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడితే జైలుకే!
author img

By

Published : Nov 20, 2020, 9:44 PM IST

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించింది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పటినుంచి ఎవరైనా ఆన్​లైన్​ రమ్మీ ఆడితే ఆరునెలల పాటు జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధించనుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ హౌస్‌ నడిపితే రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆటలో డబ్బు కోల్పోయిన అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ శుక్రవారం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు.

సెలబ్రిటీలకు నోటీసులు

ఆన్‌లైన్‌ రమ్మీకి ప్రచారం చేసినందుకు ఇటీవల క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, సౌరభ్‌ గంగూలీ, నటులు ప్రకాష్‌రాజ్‌, సుదీప్‌, రానా, తమన్నాలకు మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ సమాధానం చెప్పాలని ఆదేశించింది.

మధురైకి చెందిన మహ్మద్‌ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై విచారించిన ధర్మాసనం.. ఆట కోసం ప్రచారం చేస్తున్న ప్రముఖులు.. ప్రజా శ్రేయస్సును విస్మరిస్తూ స్వలాభంపైనే దృష్టి సారిస్తున్నారని పేర్కొంది. క్రికెట్‌ విషయంలోనూ రాష్ట్రాల పేర్లు ఉపయోగిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.