ETV Bharat / bharat

వ్యాక్సిన్ సర్టిఫికేట్​కు పాస్​పోర్ట్ లింక్ చేయండిలా.. - కొవిన్​ పోర్టల్​ కొత్త ఫీచర్లు

టీకా ధ్రువపత్రంలో పాస్​పోర్ట్​ నంబర్​ను ​యాడ్​ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం కొవిన్​ పోర్టల్​లో కొత్త ఫీచర్​ను తీసుకువచ్చింది.

passport number in  vaccine certificate
వ్యాక్సిన్ సర్టిఫికేట్​, టీకా ధ్రువపత్రం
author img

By

Published : Jun 25, 2021, 6:08 PM IST

టీకా ధ్రువపత్రానికి పాస్​పోర్టు నంబర్​ను జోడించుకునే అవకాశాన్ని కొవిన్​ పోర్టల్​ అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. ఇందుకోసం ఏం చేయాలో వివరిస్తూ.. 'ఆరోగ్య సేతు యాప్' అధికారిక ఖాతాలో​ స్క్రీన్​షాట్లను పెట్టింది. టీకా విధానంలో కేంద్రం ఇటీవల మార్పులు చేసిన నేపథ్యంలో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఎలా చేయాలంటే...

  • step 1: cowin.gov.in పోర్టల్​లోకి మొదట లాగిన్​ కావాలి.
  • step 2: రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు పక్కన, కుడివైపున 'రైజ్​​ యాన్​ ఇష్యూ' అనే డ్రాప్​డౌన్​ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
  • step 3: రైజ్​ యాన్​ ఇష్యూ ఎంపిక చేసుకున్న తర్వాత.. 'యాడ్​ పాస్​పోర్ట్​ డీటెయిల్స్​' అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • step 4: నాలుగో స్టెప్​లో కొత్త పేజీలోకి వెళ్తాం. అందులో సెలెక్ట్​ మెంబర్​ క్లిక్​ చేయాలి. ఎవరిదైతే పాస్​పోర్ట్​ను నంబర్​ను యాడ్​ చేయాలనుకుంటున్నారో వారి పేరును ఎంపిక చేసుకుని, నంబర్​ను అక్కడ ఎంటర్​ చేయాలి.
    cowin portal updates
    టీకా ధ్రువపత్రంలో పాస్​పోర్ట్​ నంబర్​ను యాడ్​ చేసుకునే విధానం

పేరు వేరేగా ఉంటే ఇలా..

ఒకవేళ పాస్​పోర్టులో ఉన్న పేరు.. టీకా ధ్రవపత్రంలో ఉన్న పేరు వేరేగా ఉన్నట్లైతే... step 1, step 2 తర్వాత 'రైజ్​ యాన్ ఇష్యూ' ఆప్షన్​ ఎంచుకోకుండా 'సర్టిఫికేట్​ కరెక్షన్​ ఆప్షన్'​ను ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత కొత్త పేజీలోకి వెళ్తాం. అక్కడ ఎవరి వివరాలనైతే మార్చాలనుకుంటున్నామో వారి పేరును ఎంపిక చేసుకుని మార్చుకోవాలి. ఈ పేరును ఒకేసారి మార్చుకునేందుకు వీలు ఉండటం వల్ల పేరును ఎంటర్​ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవటం తప్పనిసరి.

ఇదీ చూడండి: టీకా ధ్రువపత్రంలో తప్పులా? సరి చేసుకోండిలా..

కరోనా వేళ విహారమా? ఈ దేశాల్లో సాధ్యమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.