ETV Bharat / bharat

Engineer Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు​.. ఇంజినీర్ల కోసం నోటిఫికేషన్ - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

THDC Recruitment 2023 : ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​. 181 జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం 'టీహెచ్​డీసీ ఇండియా లిమిటెడ్'​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హతలు, ఫీజు, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు మీ కోసం..

THDC Recruitment 2023
THDC Recruitment 2023 for 181 junior engineer trainee posts
author img

By

Published : Jun 18, 2023, 10:31 AM IST

THDC Recruitment 2023 : మినీరత్న సంస్థ తెహ్రీ హైడ్రో డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​ (టీహెచ్​డీసీఐఎల్​) 181 జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ (సివిల్​) - 72 పోస్టులు
  • జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ (ఎలక్ట్రికల్​) - 72 పోస్టులు
  • జూనియర్​ ఇంజినీర్​ ట్రైనీ (మెకానికల్​) - 37 పోస్టులు
  • బ్యాక్​లాగ్​ పోస్టులు, ప్రస్తుత ఖాళీలు మొత్తం కలిపి 181 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్​టైమ్​ రెగ్యులర్​ డిప్లొమా/ లేటరల్​ ఎంట్రీ డిప్లొమా/ బిఎస్సీ/ బీఈ/ బీటెక్​ చదవి ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్​ సర్వీస్​మెన్​, డిపార్ట్​మెంటల్​ అభ్యర్థులు డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.

వయస్సు
2023 జూన్​ 7 నాటికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అయితే రిజర్వేషన్ల వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము
అప్లికేషన్​ ఫీజు రూ.600 ఆన్​లైన్​లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ ఎక్స్​ సర్వీస్​మెన్​/ డిపార్ట్​మెంట్​ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

  • నోట్​ : ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా తమ పేరును ఎంప్లాయ్మెంట్​ ఎక్స్ఛేంజ్​లో నమోదు చేసుకుని ఉండాలి. ఫుల్​టైమ్​ రెగ్యులర్​ డిప్లొమా లేనివారు, కరస్పాండెన్స్​ లేదా డిస్టన్స్​ విధానంలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసుకున్నవారు ఈ పరీక్షకు అనర్హులు.

ఎంపిక ప్రక్రియ
అర్హత పరీక్షను నేషనల్​ హైడ్రో ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్​ (ఎన్​హెచ్​పీసీ) సహకారంతో టీహెచ్​డీసీఐఎల్ నిర్వహించనుంది. అభ్యర్థులు కంప్యూటర్​ ఆధారిత రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.

200 మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్​ 1లో ఎలక్ట్రిక్​/ సివిల్/​ మెకానికల్​ సబ్జెక్టులకు సంబంధించిన 140 ప్రశ్నలు; పార్ట్​ 2లో జనరల్​ అవేర్​నెస్​కు సంబంధించి 30 ప్రశ్నలు; పార్ట్​ 3లో రీజనింగ్​కు సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్​ మార్కింగ్​ ఉంటుంది.

రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా వైవాకు పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • నోట్​: మెడికల్​ ఎగ్జామినేషన్​ నిబంధనల్లో ప్రత్యేక వర్గాల వారికి ఎలాంటి సడలింపు ఉండదు.

శిక్షణ, జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. వీరికి జీతం, డీఏతో పాటు.. ప్రావిడెంట్​ ఫండ్​, పెన్షన్​, గ్రాడ్యుటీ లాంటి ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. లీవ్​, మెడికల్​ ట్రీట్​మెంట్​ సదుపాయం ఉంటుంది. ఉద్యోగం రెగ్యులర్​ అయిన తరువాత కంపెనీ క్వార్టర్స్​, హెచ్​ఆర్​ఏ, నెలవారీ ఖర్చుల రీయంబర్స్​మెంట్​, మొబైల్​ సదుపాయాలు కూడా కల్పిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ : ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 జూన్​ 30లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.