Telangana Assembly Elections 2023 : గత ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్, చెల్లుబాటైన ఓట్లలో 46.87 శాతం, పోటీ చేసిన సీట్లలో 47.11 శాతం ఓట్లను సంపాదించుకుంది. 119 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ చెల్లుబాటైన ఓట్లలో 28.43 శాతం, పోటీ చేసిన స్థానాల్లో 34.54శాతం ఓట్లు సాధించింది. కానీ.. 19స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. బీజేపీ పోటీచేసిన స్థానాల్లో(BJP MLA Candidate List) 7.13శాతం ఓట్లనే సాధించగలిగింది. ఈసారి పరిస్థితి అలా లేదు. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య పోటీ పెరిగింది.
తిరుగుబాటు దారులు, స్వతంత్ర అభ్యర్ధులు చిన్నచితకా పార్టీలతో అభ్యర్థుల సంఖ్యా పెరగనుంది. ఈ నేపథ్యంలో పోటీచేసిన ప్రతిచోట కనీసంగా 40 శాతం ఓట్లు ఏ పార్టీ దక్కించుకుంటుందో వారినే విజయం వరించే అవకాశం కనిపిస్తోంది. కర్టాటకలో 'బీజేపీ- కాంగ్రెస్' మధ్య ఓటింగ్ శాతాల్లో స్వల్ఫ తేడానే ఉన్నా.. అత్యధిక సీట్లను కాంగ్రెసే కొల్లగొట్టి అధికారంలోకి రాగలిగింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం అభ్యర్ధులకు కీలకంగా మారనుంది.
పల్లెబాట పట్టిన పార్టీలు - అధికారం దక్కాలంటే ఆమాత్రం తిప్పలు తప్పవు మరి
Telangana Assembly Elections Analysis 2023 : తెలంగాణలో ప్రతి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సగటు అభ్యర్ధుల సంఖ్య 15. గత ఎన్నికల్లో 6 నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ చేసిన నియోజక వర్గాలు 22 ఉంటే, 11 నుంచి 15 మంది పోటీ చేసిన నియోజక వర్గాలు 58 ఉన్నాయి. 15 కంటే ఎక్కువ అభ్యర్ధులున్న నియోజక వర్గాల సంఖ్య 38గా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ(BJP) అన్నిచోట్ల బలమైన అభ్యర్థులను నిలుపుతోంది.
ఈసారి ఆయా పార్టీల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులు సైతం చాలా మందే ఉన్నారు. వారంతా స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, జనసేన లాంటి పార్టీలూ బరిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కనీసంగా 40శాతాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారో వారినే విజయం వరిస్తుంది.
Political History of Telangana : పోలైన ఓట్లలో 40శాతం దక్కించుకోవాలంటే.. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లను తమవైపును అభ్యర్ధులు తిప్పుకోగలగాలి. ఈసారి ఓటుహక్కు కలిగి ఉన్న వారిలో 50శాతానికి పైగా ఉన్నది యువతే. వీరిలో 18ఏళ్ల నుంచి 35ఏళ్ల ఓటర్లు కీలకం కానున్నారు. దీనికి తోడు మహిళా ఓటర్లు సగం వరకూ ఉన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో మహిళా ఓటర్ల(Telangana Female Voters) సంఖ్యే అధికం. అందుకే మహిళలకు రాజకీయ పార్టీలు అనేక వరాలు కురిపిస్తున్నాయి.
అన్నా ఎటుపోతాంది రాజకీయం - తెలంగాణలో ఏడజూసినా గిదే ముచ్చట
Telangana Elections : అభ్యర్థిత్వాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. వారిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక నిరుద్యోగ యువత కూడా ఈసారి ఓటింగ్ పై ప్రభావం చూపనున్నారు. వీళ్లే కాకుండా రైతులు, ఉద్యోగులు, వివిధ సామాజిక వర్గాలు ఆయా నియోజక వర్గాల్లో గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా, ఎవరినీ విస్మరించకుండా అన్నివర్గాల మెప్పు పొందిన అభ్యర్ధులే గెలుపు తీరాలకు చేరనున్నారు.