ETV Bharat / bharat

ఆ ఆశ తీరకుండానే టీచర్ మృతి.. ఆన్​లైన్​ క్లాస్​ చెబుతూనే...

ఆమె ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆన్​లైన్​ క్లాసులు చెబుతున్న ఆమె.. తాను విద్యార్థులను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, ఆ ఆశ తీరకుండానే... క్లాసు ముగిసిన కాసేపటికే కన్నుమూశారు. తమ టీచర్ ఆకస్మిక​ మృతితో ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

Teacher collapses during online class
ఆన్​లైన్​ క్లాసులో టీచర్ మృతి
author img

By

Published : Oct 29, 2021, 4:04 PM IST

ఆన్​లైన్​లో తాను పాఠాలు బోధిస్తున్న పిల్లలను చూడాలని ఆశపడ్డ ఓ ఉపాధ్యాయురాలు.. అది నెరవేరకుండానే(Teacher Dies During Class) కన్నుమూశారు. ఈ విషాద ఘటన కేరళ కాసరగోడ్ జిల్లాలో(Kerala kasaragod) జరిగింది.

అసలేం జరిగింది?

అడొట్టాకాయాలోని ప్రభుత్వ సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో.. కల్లార్​ ప్రాంతానికి చెందిన మాధవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి మూడో తరగతి విద్యార్థులకు ఆన్​లైన్​లో గణితం బోధించిన ఆమె.. క్లాసు ముగిసిన కాసేపటికే(Teacher Dies During Class) ప్రాణాలు కోల్పోయారు.

క్లాసు చెప్పే సమయంలో తన ఫోన్​లో రికార్డైన దృశ్యాలు... ఆమె కుటుంబ సభ్యులతో పాటు, తన విద్యార్థులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. క్లాస్ చెబుతున్నప్పుడు ఆమె.. అస్వస్థతగా కనిపించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆమె తీవ్రంగా దగ్గడం ప్రారంభించారు. ఆ వీడియోలో... వచ్చే వారం పాఠశాలలను పునఃప్రారంభం కానున్నాయని.. తాను పిల్లలందరినీ చూడాలనుకుంటున్నట్లు మాధవి చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులకు హోం వర్క్ ఇచ్చిన ఆమె.. ఆకస్మికంగా క్లాసును ముగించారు.

కొద్దిసేపటి తర్వాత... మాధవి ఇంటికి వచ్చిన బంధువు ఒకరు నేలపై అపస్మారక స్థితిలో ఆమె పడి ఉండడం చూశారు. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మాధవి చనిపోయినట్లు ధ్రువీకరించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అధిక రక్తపోటు కారణంగానే ఆమె మరణించారని చెప్పారు.

ఇదీ చూడండి: బిల్డింగ్​ పైనుంచి విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపల్​

ఇదీ చూడండి: ఆరు రోజుల పసికందును అమ్మేసిన తండ్రి.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.