ETV Bharat / bharat

దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడని చిన్నారి మర్మాంగాలకు వాతలు - కర్ణాటక లేటెస్ట్​ న్యూస్

దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడని మూడేళ్ల చిన్నారి ప్రైవేట్​ భాగాలను కాల్చారు అంగన్​వాడీ టీచర్​, హెల్పర్​. ఈ దారుణ ఘటన కర్ణాటక తుమకూరులోని చిక్కనాయకనహళ్లి గ్రామంలో జరిగింది.

student burns by teacher in tumkur
student burns by teacher in tumkur
author img

By

Published : Aug 30, 2022, 7:20 PM IST

కర్ణాటక తుమకూరులోని చిక్కనాయకనహళ్లి గ్రామంలో దారుణం జరిగింది. దుస్తుల్లో మూత్రం పోస్తున్నాడనే కారణంతో మూడేళ్ల చిన్నారి ప్రైవేట్​ భాగాలను కాల్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలుడు తరచుగా దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసేవాడు. దీంతో అంగన్​వాడీ టీచర్​, సహాయకురాలు ఆగ్రహంతో ఊగిపోయారు. అగ్గిపుల్లతో బాలుడి ప్రైవేట్​ భాగాలను కాల్చారు.

నోటీసులు జారీ చేసిన అధికారులు:
దీంతో బాలుడి ప్రైవేట్​ భాగాలతో పాటు తొడలు సైతం స్వల్పంగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారులు.. హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంగన్​వాడీ టీచర్​, హెల్పర్​కు నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి: లోయలో పడ్డ కారు.. 8 మంది మృతి

కేజ్రీవాల్​పై అన్నా హజారే ఫైర్​.. అధికార మత్తులో మునిగిపోయారంటూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.