ETV Bharat / bharat

TDP Leaders Worried about Chandrababu Naidu security: చన్నీళ్లతో స్నానం.. దోమలతో సహవాసం..కమాండోల భద్రత లేదు.. కర్రలతో కాపలా

TDP Leaders Worried about Chandrababu Naidu security: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు భద్రతపై ఆందోళన పెరుగుతోంది. ఆయన్ను అంతమొందించే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం అనుమానం వ్యక్తం చేస్తోంది. భద్రతపై ఆందోళన దృష్ట్యా వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి.. చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

TDP_Leaders_Worried_about_Chandrababu_Naidu_security

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 7:38 AM IST

TDP Leaders Worried about Chandrababu Naidu security: "చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన..కమాండోల భద్రత లేదు.. కర్రలతో కాపలా" కర్రలతో కాపలా

TDP Leaders Worried about Chandrababu Naidu security : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆయన్ను మావోయిస్టులు, వాళ్ల సానుభూతి పరులున్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు. ఇక్కడ కరడు గట్టిన నేరగాళ్లు, హంతకులు, ఆయుధాలు వినియోగంలో ఆరితేరినవారు, సుపారీ గ్యాంగులు, రౌడీషీటర్లు, తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు, గంజాయి స్మగ్లర్లు ఉన్నారు. అలాంటి చోట చంద్రబాబును ఉంచటం వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. కారాగారంలో కేటాయించిన బ్యారెక్‌లో తప్ప బయట తిరగొద్దని చంద్రబాబుకు జైలు అధికారులే సూచించారు.

TDP Leaders Said No NSG Commandos for CBN : దీన్నిబట్టే ఆయన భద్రత ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. జైలుకు పంపటంతో అక్కడ ఎన్​ఎస్​జీ కమాండోల భద్రత లేకుండా పోయింది. కేవలం నలుగురైదుగురు జైలు సిబ్బంది షిఫ్టుల వారీగా కర్రలతో కాపలా ఉంటున్నారు. ఏ మావోయిస్టుల వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి ఎన్​ఎస్​జీ కమాండోల భద్రత కల్పించారో, అదే మావోయిస్టులున్న చోట ఇప్పుడు ఉంచటంపై ఆందోళన నెలకొంది. ఎన్ఎస్​జీ కమాండోల రక్షణ వలయంలో ఉన్న ఆయన్ను ఆ భద్రత నుంచి తప్పించేందుకే అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారని, దీని వెనుక ఆయన్ను అంతమొందించాలనే కుట్ర ఉండొచ్చని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

TDP Leaders Protest on CBN Security in Jail: 'జైలులో చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉంది'

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందరూ లాకప్ బయటే ఉంటారు. వారిలో కరడు గట్టిన నేరగాళ్లు, ఆయుధాలు వినియోగించినవారు, ఇలా అనేక మంది ఉంటారు. లాకప్ బయట తిరుగుతున్నప్పుడు వీరిలో ఎవరైనా చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని భావించి దూసుకెళ్తే వారిని కేవలం కర్రలతో నియంత్రించటం సాధ్యపడుతుందా? కారాగారంలో సిబ్బంది కొరతతో కొంత మంది ఖైదీలనే సిబ్బందిగా వినియోగిస్తూ వారితో పనులు చేయిస్తుంటారు. అలా పనుల కోసం వెళ్లిన వారి వల్ల ముప్పు వాటిల్లదని నమ్మకమేంటి?

CCTV Cameras are Installed at Sneha Block : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికార పెద్దల కనుసన్నల్లో ఉందని మాజీ హోం మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్న కొందరు అధికారుల్ని ఇక్కడ విధులకు నియమించారని వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారాన్ని పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గదిలోనూ ఏర్పాటు చేశారని, దాంతో చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.

జైలులో చంద్రబాబుకు భద్రత, సౌకర్యాల కల్పనపై సందేహాలు వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ తనిఖీలు చేశారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలపై ఆయన ఎలాంటి ప్రకటన వెలువరించ లేదు. ఇవి సాధారణ తనిఖీలేనని జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబుకు అరకొర వసతులు కల్పిస్తున్నారు.

రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కారాగారంలో కేటగిరి 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. కానీ అవేవీ ఇవ్వలేదు. 74 ఏళ్ల వయసులో, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను నిర్బంధించిన బ్యారక్ చుట్టూ దట్టమైన చెట్లు ఉన్నాయి. వాటివల్ల విపరీతమైన దోమలు. రోజంతా ఆ దోమల కాట్ల మధ్యే గడపాల్సి వస్తోంది.

MLC Anuradha Comments on Chandrababu Security in Rajahmundry Central Jail: "రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదు"

సాధారణంగా కారాగారంలో 60ఏళ్లు దాటిన వారికి స్నానానికి విధిగా వేడినీళ్లు సమకూర్చాలనే నిబంధన ఉంది. కానీ చంద్రబాబుకు స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ములాఖత్‌లో కలిసి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు కేటాయించిన చోట కేటగిరీ1 స్థాయిలో వసతులు కనిపించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గది శుభ్రత, కేటాయించిన మంచం, కుర్చీలు కూడా అనువుగా లేవని తెలుస్తోంది. కేవలం ఒక ఫ్యాన్, బెడ్ మాత్రమే ఇచ్చారు.

జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం నిత్యం వైద్య సేవలు అందించాలి. భద్రతపై అనుమానాల నేపథ్యంలో వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం మాత్రం పరీక్షలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జైలు లోపల కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్న అధికారులు.. తెలుగుదేశం నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పష్టత ఇవ్వడం లేదు.

Doubts on Chandrababu security : జైలు లోపలి దృశ్యాలు బయటకు... సూపరింటెండెంట్‌ బదిలీ యత్నాలు.. ఈ చర్యలు దేనికి సంకేతం...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.