ETV Bharat / bharat

తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​ - చెన్నైలో భారీ వర్షాలు

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నై(chennai rain today) సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంత జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ. పుదుచ్చేరిలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Rain lashes parts of Chennai
చెన్నైలో భారీ వర్షం
author img

By

Published : Nov 18, 2021, 5:34 PM IST

Updated : Nov 18, 2021, 6:24 PM IST

తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​

తమిళనాడును వర్షాలు(chennai rain update) ఇప్పట్లో వదిలే సూచనలు కనిపించటం లేదు. కొద్ది రోజులుగా సద్దుమణిగినట్లు కనిపించినా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గురువారం చెన్నై నగరం(chennai rain today) సహా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains) కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Rain lashes parts of Chennai
ఇంట్లోకి చేరిన వరద నీటిని బయటకి పోస్తున్న మహిళ

తిరుపట్టుర్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద(floods today) నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షాల(Rains today) కారణంగా పలు ప్రాంతాల్లో పాత ఇళ్లు, గోడలు కూలిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Rain lashes parts of Chennai
చెన్నైని ముంచెత్తిన వర్షం

చెన్నై(chennai rain update) సహా తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Rain lashes parts of Chennai
పాఠశాలలోకి చేరిన వరద నీరు

" భారీ వర్షాలు కురిచే అవకాశం ఉన్నందున అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించాం. మిగిలిన జిల్లాల్లో కొన్నింటికి ఆరెంజ్​ అలర్ట్​ ఇచ్చాం."

- పువియారసన్​, ఎంఈటీ విభాగం డైరెక్టర్​, చెన్నై

పుదుచ్చేరిలో భారీ వర్షాలు

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిని వర్షాలు(Rains latest news) ముంచెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యహ్నం 1 గంట వరకు 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరి సహా కరైకల్​లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్​ రంగస్వామి పర్యటించారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Rain lashes parts of Chennai
ఇంట్లోకి చేరిన వరద నీరు

అక్టోబర్​ 26 నుంచి పుదుచ్చేరిలో 68.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం నుంచి భారీ వర్షాలు(rains latest news) కురుస్తున్నాయని చెప్పారు. సహాయ చర్యల కోసం కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మదుకరాయ్​ జిల్లాలో ఓ యువకుడు వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు కలెక్టర్​ పుర్వ గార్గ్​ తెలిపారు. 62 గుడిసెలు, 27 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 194 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Rain lashes parts of Chennai
పాఠశాలను మూసివేస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి: జలదిగ్బంధంలో చెన్నై.. వీధుల్లో పడవ ప్రయాణం!

Last Updated : Nov 18, 2021, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.