ETV Bharat / bharat

'తాజ్​మహల్​' సందర్శనపై కొవిడ్​ ఎఫెక్ట్​- టికెట్​ కౌంటర్లు క్లోజ్​! - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

Taj Mahal ticket counter: కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. తాజ్​మహల్​ సందర్శనపై ప్రభావం పడింది. టికెట్​ కౌంటర్లను మూసివేశారు అధికారులు. అయితే, సందర్శకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు.

Taj Mahal
తాజ్​మహల్​
author img

By

Published : Jan 4, 2022, 7:29 AM IST

Updated : Jan 4, 2022, 8:06 AM IST

Taj Mahal ticket counter: దేశంలో కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది. ఒమిక్రాన్​ వేరియంట్​తో కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఈ ప్రభావం ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రాలోని తాజ్​మహల్​, ఆగ్రా కోట సందర్శనలపై పడింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మాన్యూవల్​ టికెట్​ కౌంటర్లను మూసివేశారు అధికారులు.

Agra Fort
ఆగ్రా కోట వద్ద సందర్శకులు

భారీగా జనం గుమిగూడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఆర్కియాలజిస్ట్​ డాక్టర్​ రాజ్​కుమార్​. సందర్శనను పూర్తిగా నిలిపివేయలేదని స్పష్టం చేశారు.

" టికెట్​ కౌంటర్ల వద్ద భారీగా జనం చేరుతున్నారు. దాంతో.. మాన్యువల్​ టికెట్​ కౌంటర్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే, చారిత్రక కట్టడాల సందర్శన పూర్తిగా నిలిపివేయలేదు."

- డాక్టర్ రాజ్​ కుమార్​ పటేల్​, సూపరింటెండింగ్​ ఆర్కియాలజిస్ట్​.

ఉత్తర్​ప్రదేశ్​లో సోమవారం 514 కొవిడ్​-19 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 ఒమిక్రాన్​ కేసులు బయపడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: ముంబయిలో కరోనా విలయం- తొలిరోజు 40 లక్షల మంది టీనేజర్లకు టీకా

Last Updated : Jan 4, 2022, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.