ETV Bharat / bharat

'చూస్తుండగానే వారంతా సజీవదహనం.. మేము ఏమీ చేయలేకపోయాం!' - మహారాష్ట్ర బస్ యాక్సిడెంట్ లేటెస్ట్ న్యూస్

Maharashtra Bus Accident : మహారాష్ట్ర బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు, వారికి సాయం చేసిన స్థానికులు.. మిగిలిన వారు తమ కళ్లెదుటే సజీవదహనమైన క్షణాల్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల.. చూస్తూ ఉండడం తప్ప తామేమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 1, 2023, 9:24 AM IST

Updated : Jul 1, 2023, 1:31 PM IST

మహారాష్ట్ర బస్సు ప్రమాదం

Maharashtra Bus Accident : మహారాష్ట్రలో 26 మందిని బలిగొన్న బస్సు ప్రమాదంలో అతికొద్ది మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగారు. అతికష్టం మీద బస్సు వెనుక అద్దం పగలగొట్టి, బయటపడినట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడు. తనతోపాటు మరికొందరు మాత్రమే అలా చేయగలిగినట్లు వెల్లడించాడు.
"బస్సు టైరు పేలింది. వెంటనే వాహనానికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. నేను, నా పక్క సీట్ల కూర్చున్న ప్రయాణికుడు మాత్రమే బస్సు వెనుక అద్దం పగలగొట్టి బయటకు వచ్చాం. ప్రమాదం జరిగిన కాసేపటికే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు" అని పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికుడు చెప్పాడు.

మహారాష్ట్ర బుల్డానా జిల్లా సిండ్​ఖేడ్​రాజా ప్రాంతంలో సమృద్ధి ఎక్స్​ప్రెస్​వేపై శనివారం 1.30గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్గర్లోని పింపల్​ఖుటా గ్రామ ప్రజలు కూడా వీరికి సహాయక చర్యల్లో తమ వంతు సాయం అందించారు. హైవేపై వెళ్తున్న వాహనాల్లోని వారు ఆగి, సాయం చేసి ఉంటే.. మరింత మందిని కాపాడగలిగేవారమని పింపల్​ఖుటా గ్రామస్థులు వాపోయారు.

Maharastra bus tragedy
మంటల్లో చిక్కుకున్న బస్సు

Maharastra Road Accident Death Toll : "ఈ మార్గంలో పింపుల్​ఖుటా దగ్గర అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు సాయం చేసేందుకు మమ్మల్ని పిలిచారు. మేము వెళ్లి చూస్తే పరిస్థితి భయానకంగా ఉంది. బస్సు టైర్లు ఊడిపోయి ఉన్నాయి. లోపల ఉన్నవారు అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తూ కనిపించారు. బస్సులోనే వారు సజీవ దహనం అయ్యారు. మంటలు చాలా తీవ్రస్థాయిలో ఉండడం వల్ల మేమేమీ చేయలేకపోయాం. కన్నీరు పెడుతూ అలా చూస్తూ ఉండిపోయాం.

బస్సులోని నలుగురు-ఐదుగురు ప్రయాణికులు ఓ అద్దం పగలగొట్టి బయటకు రాగలిగారు. కానీ మిగిలిన వారు అలా చేయలేకపోయారు. హైవేపై వెళ్తున్న ఇతర వాహనాల్ని ఆపి, తమకు సాయం చేయమని కోరామని.. బస్సు నుంచి బయటకు వచ్చిన వారు చెప్పారు. కానీ.. ఎవరూ ఆగలేదని అన్నారు." అని స్థానికుడు ఆవేదనతో చెప్పాడు.

Maharastra bus tragedy
బుస్సు ప్రమాద దృశ్యాలు

Maharashtra Road Accident Update : ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శింథే శనివారం ఉదయం ప్రకటించారు.

Maharastra bus tragedy
బస్సు వద్ద రెస్క్యూ సిబ్బంది

Last Updated : Jul 1, 2023, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.