ETV Bharat / bharat

Supreme Court On TDP leaders Bail : సుప్రీంకోర్టులో వైసీపీ సర్కారుకు చుక్కెదురు.. టీడీపీ నేతల బెయిల్​ రద్దు పిటిషన్ తిరస్కరణ

Supreme Court On TDP leaders Bail : సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అంగళ్లు కేసులో కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించింది. టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన 6 వేర్వేరు పిటిషన్లు కొట్టివేసింది.

supreme_court_on_tdp_leaders_bail
supreme_court_on_tdp_leaders_bail
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 12:36 PM IST

Supreme Court On TDP leaders Bail : సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అంగళ్లు కేసులో కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కరించింది. టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన 6 వేర్వేరు పిటిషన్లు కొట్టివేసింది.

AP High Court hearing on CBN Angallu Bail Petition: అంగళ్లు ఘటనలో చంద్రబాబు బెయిల్​ పిటిషన్​ విచారించిన హైకోర్టు..

పుంగనూరు, అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు గత నెల 21న ఏపీ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు 79 మందికి బెయిల్​ మంజూరు చేస్తూ.. వారంతా ప్రతి మంగళవారం పోలీస్​ స్టేషన్​లో హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీ రామ్‌భూపాల్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇవే కేసుల్లో ముందస్తుగా మరో 30 మంది టీడీపీ నేతలు బెయిల్ పిటిషన్‌ (Bail Petition) వేయగా.. తదుపరి విచారణ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. బెయిల్​ మంజూరైన టీడీపీకి చెందిన నేతలు 79 మంది ప్రస్తుతం చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై కొనసాగిస్తున్న విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu) యుద్ధభేరి చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. టీడీపీ అధినేత ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District)లో పర్యటించారు. జిల్లాలోని పుంగనూరు బయల్దేరగా.. అంగళ్లు వద్ద చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దాడులకు ఆజ్యం పోశారు. టీడీపీ శ్రేణులను అడ్డుకోవటమే కాకుండా మరింత రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు... రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలపై దాడి చేశారు. ఈ దాడిలో చాలా మంది టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. మరోవైపు చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు కూడా ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓ వైపు పోలీసులు అడ్డుపడగా.. మరోవైపు టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చించివేయటంతో మరింత ఉద్రిక్తత నెలకొంది.

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

చేయని తప్పునకు దాదాపు 45 రోజులు పాటు జైల్లో ఉన్నామని అంగళ్లు ఘటనలో అరెస్ట్ అయిన బాధితులు వాపోయారు. 157 మంది టీడీపీ కార్యకర్తల్లో 52 మంది బెయిల్ పై విడుదలకాగా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. పొలాల్లో పని చేసుకుంటున్న తమని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) ప్రోత్సాహంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదనే భయం పట్టుకుందని, టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.

బెయిల్ పై విడుదలైన వారందరికీ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు. విడుదలైన వారంతా తమ కుటుంబీకులు, బంధువులను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారే తమపై దాడులు చేశారని తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలో తాము లేకపోయినప్పటికీ పోలీసులు అక్రమంగా తమపై కేసులు నమోదు చేశారని మరికొందరు వాపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆడిన నాటకంలో తాము ఇరుక్కుని దాదాపు 45 రోజులు పాటు జైల్లో ఉన్నామని తెలిపారు.

Chandrababu Fires on Minister Peddireddy: ఈ రోడ్డు మీ తాత జాగీరా.. పుంగనూరుకు మళ్లీ వస్తా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.