ETV Bharat / bharat

గుడ్​ న్యూస్.. 11వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. టెన్త్ పాసైతే చాలు!

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీగా నోటిఫికేషన్​ విడుదల చేసింది. 11 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల వెలువరించింది. రాత పరీక్ష ఏప్రిల్​లో ఉండొచ్చని తెలిపింది.

ssc mts notification 2023
ssc mts notification 2023
author img

By

Published : Jan 20, 2023, 6:37 PM IST

SSC MTS Notification 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిటీ- ఎస్​ఎస్​సీ గుడ్ న్యూస్​​ తెలిపింది. జనవరి 18న స్టాఫ్​​ సెలక్షన్​ కమిషన్​ పదో తరగతి విద్యార్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 11,409 మల్టీ టాస్కింగ్​, హవల్దార్ పోస్ట్​లకు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. మొదటిసారిగా ఎస్​ఎస్​సీ 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించనుంది. తెలుగులో కూడా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వెబ్​సైట్​లో పేర్కొంది. ఇందుకు కావలసిన అర్హత, వయోపరిమితి, దరఖాస్తు చివరి తేదీ వంటి వివరాలు మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య : 11,409

  • మల్టీ టాస్కింగ్ (నాన్​ టెక్నికల్​)​ స్టాఫ్​​: 10,880 (వీటిలో ప్యూన్​, డాప్​టరీ, జమాదార్​, చౌకీదార్​, సఫాయ్​వాలా,మెయిల్ వంటి ఉద్యోగాలు ఉంటాయి)
  • హవల్దార్ పోస్టులు : 529 (వీటిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్(సీబీఎన్​) ఉద్యోగాలు ఉంటాయి)
  • ఇవి దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాలు, కేంద్ర సర్వీస్​ల్లో 'గ్రూప్-​సీ' కింద నాన్​ గెజిటెడ్​ పోస్టులు.

విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్​(10వ తరగతి ఉత్తీర్ణత) తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:

  • మల్టీ టాస్కింగ్ పోస్టులకు 18 నుంచి 25 సవంత్సరాల మధ్య ఉండాలి. అంటే 1998 జనవరి 02 నుంచి 2005 జనవరి 01 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. నింబధనల ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
  • హవల్దార్​ పోస్టుల్లో సీబీఐసీకి దరఖాస్తూ చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలి. అంటే 1996 జనవరి 02 నుంచి 2005 జనవరి 01 మధ్య జన్నించిన వారు మాత్రమే అర్హులు. సీబీఎన్​కు మల్టీ టాస్కింగ్ స్టాఫ్​​కు ఉన్న అర్హతలు ఉంటే సరిపోతుంది. నిబంధనల ప్రకారం.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది.

దరఖాస్తు రుసుం:
దరఖాస్తు రుసుమును రూ.100 గా నిర్ణయించింది ఎస్​ఎస్​సీ బోర్డు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కొందరికి ఫీజులోనూ వినహాయింపు ఉంటుంది. ఆన్​లైన్​ లేదా బ్యాంకులో చలానా తీసి పంపించవచ్చు.

పరీక్షా విధానం:
పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. మొదటి రెండు దశలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. కంప్యూటర్​ ఆధారిత పరీక్ష(సీబీటీ) హిందీ, ఇంగ్లిష్​తో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా వంటి ఇతర భాషల్లో మొదటి సారిగా పరీక్షను నిర్వహించబోతున్నట్లు ఎస్​ఎస్​సీ వెల్లడించింది.

  • స్టేజ్​-1(ప్రిలిమినరీ పరీక్ష): ఈ దశలో నెగెటివ్ మార్కులు ఉండవు.
  • స్టేజ్​-2 (మెయిన్స్​ పరీక్ష): ఈ దశలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. తప్పుగా సమాధానం గుర్తించిన ఒక ప్రశ్నకు ఒక నెగెటివ్ మార్కు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • స్టేజ్-3 (పీఈటీ): హవల్దార్ పోస్టులకు మాత్రమే ఈ దేహదారుఢ్య పరీక్ష ఉంటుంది.
  • అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్​ ఉంటుంది.

టైర్​-1 పరీక్షా సరళి:

సబ్జెక్ట్​ప్రశ్నలుమార్కులుసమయం
న్యూమరికల్​ అండ్ మెంటల్ ఎబిలిటీ206045 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రోబ్లమ్​ సాల్వింగ్​2060
మొత్తం40120

టైర్​-2 పరీక్షా సరళి:

జనరల్ అవేర్​నెస్257545 నిమిషాలు
ఇంగ్లిష్​ అండ్​ కాంప్రహెన్షన్2575
మొత్తం50150

నోట్​: టైర్​-2లో నెగెటివ్​ మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రశ్నకు 1/3 వంతు నెగెటివ్ మార్కులు ఉంటాయి.

ఎస్​ఎస్​సీ ఎంటీఎస్​ 2023కు సంబంధించి ముఖ్యమైన తేదీలు:

  • ఆన్​లైన్​లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: జనవరి 18, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 17, 2023
  • ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: ఫిబ్రవరి 19, 2023
  • చలానాకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2023
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఏప్రిల్​ 2023

మరిన్ని వివరాలు కోసం స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ అధికారిక వెబ్​సైట్​ను సంప్రదించండి..​ www.ssc.nic.in

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.