ETV Bharat / bharat

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం - undefined

Srinagar encounter: జమ్ముకశ్మీర్ జకూరా ప్రాంతంలో ఎన్​కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

Srinagar encounter
శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Feb 5, 2022, 6:41 AM IST

Srinagar encounter: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

వీరు తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు(ఎల్​ఈటీ)కు చెందిన ఉగ్రవాదులని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని ఇఖ్లాక్​ హజామ్​గా గుర్తించారు. హసన్‌పోరా, అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెచ్‌.సీ అలీ మహ్మద్ హత్యలో హజామ్​ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి నుంచి రెండు పిస్టల్స్​ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: బస్సు బోల్తా- 25 మందికి తీవ్ర గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.