ETV Bharat / bharat

నాన్న కొడతాడనే భయంతో పెరట్లో దాక్కున్న చిన్నారి.. పాము కాటేసి మృతి - kanyakumari news

నాన్న కొడతాడనే భయంతో పెరట్లో దాక్కున్న చిన్నారిని విషసర్పం కాటేసింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. తమిళనాడు కన్యాకుమారిలో ఈ విషాద ఘటన జరిగింది.

Snake Bitten 4 year old girl - Father's Violence killed her
నాన్న కొడతాడని భయంతో దాకున్న చిన్నారి.. పాము కాటేసి మృతి
author img

By

Published : Jun 16, 2022, 6:59 AM IST

తమిళనాడు కన్యాకుమారి కుత్తైకాడు పలవిలైలో విషాద ఘటన జరిగింది. రోజూ తొగిచ్చి ఇంట్లో గొడవ చేసే నాన్న కొడతాడనే భయంతో ఓ చిన్నారి పెరట్లో దాక్కోగా.. విష సర్పం ఆమెను కాటేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలిక కన్నుమూసింది. దీంతో ఆమె తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలిసి గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో చిన్నారి ఇంటికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Snake Bitten 4 year old girl - Father's Violence killed her
నాన్న కొడతాడని భయంతో దాకున్న చిన్నారి.. పాము కాటేసి మృతి

ఈ గ్రామంలో సురెందిన్ అనే వ్యక్తి రోజు కూలీగా పని చేస్తున్నాడు. అతని భార్య సిజిమోల్. వీరికి ముగ్గురు పిల్లలు సుశ్విన్​ సిజో(12), సుజిలిన్​ జో(9), సుశ్విక మోల్​(4) ఉన్నారు. సురెందిన్​ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి భార్య, పిల్లలను కొడతాడు. మంగళవారం రాత్రి కూడా ఇలాగే తాగొచ్చాడు. భార్యను కొడుతుండగా.. పిల్లలు భయపడి ఇంట్లో నుంచి పారిపోయారు. దగ్గర్లోని చెట్ల పొదల్లో దాకున్నారు. అక్కడే నిద్రపోయారు. అయితే ఓ విష సర్పం.. సుశ్విక నిద్రలో ఉండగా కాటేసింది. ఆ తర్వాత ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆస్పత్రిలో 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.