ETV Bharat / bharat

నడిరోడ్డుపై 20 సార్లు రాయితో కొట్టి యువకుడి హత్య.. కన్నకొడుకునే సుపారీ ఇచ్చి.. - ఇంటికేటర్​ వేయమన్నందుకు యువకులపై దాడి

వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని ఆరుగురు కలిసి రాయితో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది. మరోవైపు, సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన దారుణం హుబ్లీలో జరిగింది.

Six persons killed young man
యువకుడిని చంపిన ఆరుగురు వ్యక్తులు
author img

By

Published : Dec 6, 2022, 4:05 PM IST

కర్ణాటకలోని బెంగళూరులో ఘోరం జరిగింది. ఆరుగురు కలిసి ఓ యువకుడిని రాయితో కొట్టి చంపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతుడిని బాదామికి చెందిన బాలప్ప జమఖండిగా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కేపీ అగ్రహారలోని ఓ మెడికల్ షాపులో బాధితుడు తన మొబైల్​కు ఛార్జింగ్​ పెట్టాడు. అంతలో అక్కడికి ఆరుగురు వ్యక్తులు వచ్చారు. బాలప్పతో గొడవకు దిగారు. అనంతరం అక్కడ ఉన్న రాయితో 20 సార్లు బాలప్ప తలపై కొట్టి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితులు బాదామికి చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

కన్నకొడుకునే సుపారీ ఇచ్చి..
కర్ణాటక హుబ్లీలో దారుణం జరిగింది. కన్నకొడుకునే సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి. మృతుడిని అఖిల్ జైన్​(30)గా గుర్తించారు పోలీసులు.
అఖిల్ జైన్ కొద్ది రోజుల నుంచి కనిపించట్లేదని అతడి తండ్రి అయిన వ్యాపారవేత్త భరత్ జైన్.. కేశ్వాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అఖిల్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడని తేలింది. ఈ క్రమంలో అతడిపై కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫోన్​కాల్​ లిస్ట్​ను పరిశీలించగా పోలీసులకు మరింత సమాచారం లభించింది. అఖిల్ తండ్రి భరత్ జైన్​.. కొందరు రౌడీలతో ఫోన్​లో మాట్లాడినట్లు తేలింది. భరత్​ జైన్​ను పోలీసులు విచారించగా.. తానే సుపారి ఇచ్చి అఖిల్​ను హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు.

పొలంలో మృతదేహం..
ఝార్ఖండ్.. ధన్​బాద్​లో యువకుడి మృతదేహం పొలంలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బిహార్​కు చెందిన జితేంద్ర (40)గా పోలీసులు గుర్తించారు. జితేంద్ర.. డ్రైవర్​గా పనిచేసేవాడని అతని సోదరుడు సత్యేంద్ర సింగ్ తెలిపాడు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని.. అందువల్లే మరణించి ఉండవచ్చని పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మృతదేహాన్ని పీక్కుతింటున్న కుక్కలు..
ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​లో అమానవీయ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం స్థానికంగా కలకలం రేపింది. అలాగే మృతదేహం మీదుగా పలు వాహనాలు వెళ్లడం వల్ల నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి జరిగిందీ ఘటన.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.