ETV Bharat / bharat

ఐఈఎస్​లో మెరిసిన బధిర సోదరీ'మణులు'.. రాష్ట్రం నుంచి ఇద్దరే! - కేరళ

Sisters With Hearing Impairment: చదువుకోవడానికి అన్ని సదుపాయాలున్నా సాకులు చెప్పి తప్పించుకునేవారు బోలెడుమంది ఉంటారు. అయితే ఆర్థికంగా వెనుకబడినా, వినికిడి లోపం వెక్కిరించినా.. లక్ష్య ఛేదనలో పైచేయి సాధించారు ఈ అక్కాచెల్లెల్లు. చెవులు దద్దరిల్లే విజయగాథను లిఖించారు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంజనీరింగ్​ సర్వీసెస్​లో తమ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించింది వారు మాత్రమే. ఈ కథను మీరూ చదివేయండి!

Hearing-impaired twin sisters
Indian Engineering Services exam
author img

By

Published : Apr 1, 2022, 4:42 PM IST

Updated : Apr 1, 2022, 5:00 PM IST

Sisters With Hearing Impairment: భారత్​లో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి.. ఇండియన్​ ఇంజనీరింగ్​ సర్వీసెస్ (ఐఈఎస్). ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణులవటం కష్టం. అలాంటిది ఇద్దరు బధిర సోదరీమణులు.. అందులో ర్యాంకు సంపాదించి నిజంగానే 'మణులు' అనిపించుకున్నారు. వారే కేరళకు చెందిన పార్వతీ ఎస్, లక్ష్మి ఎస్. ఆ రాష్ట్రం నుంచి ఐసీఎస్ ఉత్తీర్ణత సాధించింది కూడా వీరిద్దరే. అఖిల భారత స్థాయిలో పార్వతి 74వ ర్యాంకు, లక్ష్మి 75వ ర్యాంకుతో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

కలను సాకారం చేసుకోవడంలో తమ లోపాన్ని అడ్డురానివ్వలేదు ఈ అక్కాచెల్లెల్లు. అయితే.. అదేమంత సులువు కాదు. వినికిడి లోపం కారణంగా అందరిలా వీరు కోచింగ్​ సెంటర్​లకు వెళ్లలేరు. అయినా పట్టువిడవలేదు. నిరంతర కఠిన పరిశ్రమ, నిబద్ధతతో చదివారు. చెవులు దద్దరిల్లే విజయఢంకా మోగించారు.

తల్లే.. అన్నీ తానై: వీరి తల్లి సీత.. ప్రజాపనుల విభాగంలో జూనియర్ సూపర్​ఇంటెండెంట్​గా పనిచేస్తున్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఆ ప్రభావం చిన్నారులపై పడనివ్వలేదు సీత. వారికి ఉన్నత విద్యను అందించేందుకు శాయశక్తుల కష్టపడ్డారు. ఆమె గర్వపడే విజయాన్ని అందించారు.. పార్వతి, లక్ష్మి!

ఆ ఉద్యోగాలను కాదని: వినికిడి లోపం కారణంగా పెదాల కదలికలను బట్టి ఎదుటివారు మాట్లాడేదాన్ని వీరు అర్ధం చేసుకుంటారు. తిరువనంతరపురం ఇంజనీరింగ్​ కళాశాలలో ప్రవేశపరీక్షలో పాసై అడ్మిషన్​ సంపాదించారు పార్వతి, లక్ష్మి. ఆ తర్వాత పార్వతికి కేరళ ప్రభుత్వ ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్​ ఇంజనీర్​గా ఉద్యోగం వచ్చింది. లక్ష్మి కూడా స్థానిక యంత్రాంగ శాఖలో అసిస్టెంట్​ ఇంజనీర్​గా తాత్కాలిక ఉద్యోగం పొందింది.

ఈ అక్కాచెల్లెల్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలూ వచ్చాయి. అయితే వాటిని తిరస్కరించి ఇండియన్​ ఇంజనీరింగ్​ సర్వీసెస్​కు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. 2019 నుంచి పరీక్షలు రాయడం మొదలుపెట్టారు.

ఇదీ చూడండి: బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు

Last Updated : Apr 1, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.