Sidharth Luthra Tweet: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతను చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. దీంతో ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్లో గురు గోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావించారు.
Supreme Court Lawyer Sidharth Luthra Tweet: సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటానికి ఇదే సరైన విధానమంటూ గురుగోవింద్ సింగ్ ప్రవచనాన్ని పేర్కొన్నారు. నేటి సూక్తి అంటూ సిద్ధార్థ లూథ్రా చేసిన ఈ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
-
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
Rajinikanth phone call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు..
Siddharth Luthra Meet Chandrababu Naidu: రాజమహేంద్రవరంలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిని కలిశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాలు చర్చించారు. క్వాష్ పిటిషన్ హైకోర్టు వాయిదా వేయడంతో.. జరిగిన పరిణామాలపై వివరించారు. చంద్రబాబును కలిసిన అనంతరం తిరిగి లూథ్రా.. లోకేశ్ వద్ద కొద్దిసేపు గడిపి విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Chandrababu Petition in High Court: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. విచారణను క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరడంతో.. అందుకు హైకోర్టు అంగీకరించింది.
AP CID Custody Petition: అదే విధంగా సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై ఈ నెల 18వ తేదీ వరకూ విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును.. హైకోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబును 5 రోజులు కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో.. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Amaravati Inner Ring Road Case: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణను ఈనెల 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇందులో చంద్రబాబు నాయుడుని మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది.
I Am with Babu Program: మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 'బాబుతో నేను' పేరుతో టీడీపీ ప్రజాచైతన్య కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో నేటి నుంచి ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రభుత్వ కుట్రలను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అదే విధంగా టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఓ పాటను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుంది. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.