ETV Bharat / bharat

సీన్​ రివర్స్, రాహుల్ గాంధీ​ పీఏ అరెస్ట్, వారిని ఇరికిద్దామనుకుంటే - kerala politics news

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యక్తిగత సహాయకుడు సహా ఆ పార్టీకి చెందిన మరో ముగ్గుర్ని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వయనాడ్​లోని రాహుల్ ఆఫీస్​లోని మహాత్మ గాంధీ చిత్రపటం ధ్వంసం కేసులో ఈమేరకు చర్యలు చేపట్టారు. ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలే ఈ పని చేశారని నమ్మించేందుకు వారంతా యత్నించారని పోలీసులు తేల్చారు.

Rahul Gandhi
గాంధీ ఫొటో ధ్వంసం కేసులో రాహుల్​ పీఏ అరెస్ట్
author img

By

Published : Aug 19, 2022, 4:15 PM IST

మహాత్మ గాంధీ చిత్రపటం ధ్వంసం కేసులో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తల్ని కేరళలోని కల్పట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడు కావడం గమనార్హం. వయనాడ్​లోని రాహుల్​ ఆఫీస్​పై దాడి చేసిన స్టూడెంట్ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా-ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలే.. గాంధీ ఫొటోను ధ్వంసం చేశారని నమ్మించేందుకు రాహుల్ పీఏ రథీశ్ కుమార్​ సహా మిగిలిన ముగ్గురు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు.

ఆ వీడియోతో గుట్టు రట్టు
SFI Rahul Gandhi office : రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్​ నియోజకవర్గం నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్​ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్​ జోన్​గా కేంద్రం ప్రకటించడం వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నా.. రాహుల్​ ఏమీ చేయడంలేదంటూ ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు జూన్ 24న నిరసనకు దిగారు. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ(సీపీఎం) అధిష్ఠానం అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆందోళన హింసాయుతంగా మారింది. కొందరు కార్యకర్తలు రాహుల్ కార్యాలయంలోకి చొరబడి లోపలున్న వస్తువుల్ని ధ్వంసం చేశారు.

రాహుల్ ఆఫీస్​పై దాడిపై అధికార సీపీఎంను తప్పుబడుతూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్. కార్యాలయం మొత్తం ధ్వంసం చేశారంటూ వీడియోలు రిలీజ్ చేసింది. వాటిలో గాంధీ ఫొటో దెబ్బతిని, నేలపై పడి ఉండడం కనిపించింది. కానీ.. రాహుల్ ఆఫీస్​పై దాడి జరిగిన కాసేపటి తర్వాత కొందరు ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలు తీసిన వీడియోలు చూస్తే మాత్రం.. గాంధీ ఫొటో గోడపై సవ్యంగానే ఉంది.

ఈ వీడియోలతో పోలీసులకు అనుమానం వచ్చింది. కాంగ్రెస్​ పార్టీ కార్యాలయ సిబ్బందిని అదుపులోకి తీసుకుని అనేక గంటలపాటు ప్రశ్నించారు. చివరకు రాహుల్ గాంధీ పీఏ రథీశ్, కార్యాలయ సిబ్బంది రాహుల్, కాంగ్రెస్ కార్యకర్తలు నౌషద్, ముజీబ్​ను అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించారు కేరళలోని కల్పట్ట పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.