ETV Bharat / bharat

ఆస్పత్రిలో 4 గంటలు పవర్​ కట్​.. నలుగురు నవజాత శిశువులు మృతి - ఛత్తీస్​గఢ్​ నలుగురు శిశువులు మృతి

ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్​ సరఫరా నిలిచపోవడం వల్ల నలుగురు నవజాత శిశువులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

children died
children died
author img

By

Published : Dec 5, 2022, 3:03 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో పెను విషాద ఘటన జరిగింది. ఆస్పత్రిలో నాలుగు గంటల పాటు విద్యుత్​ సరఫరా నిలిచిపోవడం వల్ల చికిత్స పొందుతున్న నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సుర్గుజా జిల్లాలోని అంబికాపుర్‌ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.

ఆస్పత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ తర్వాత దోషులుగా తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.