Limbo Skating Girl Guiness Record: కాళ్లకు చక్రాలు కట్టుకుని రయ్‌మంటూ దూసుకెళ్తున్న ఈ చిన్నారి పేరు దేశ్నా నాహార్. వయసు ఏడేళ్లు. స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ప్రస్తుతం దేశ్నా మూడో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే కఠినమైన లింబో స్కేటింగ్ సాధన చేసిన దేశ్నా.. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కేవలం 13.74 సెకన్లలో 20కార్ల కింద నుంచి దూసుకెళ్లింది. 2015లో చైనాకు చెందిన 14ఏళ్ల బాలిక పేరున ఉన్న రికార్డును చెరిపివేసింది.
నాన్నమ్మ ప్రోత్యాహంతో మరింతగా..
ఏప్రిల్ 16న ఈ ఘనత సాధించగా.. జూన్ 14న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దేశ్నా పేరు నమోదైంది. పుణెకు చెందిన విజయ్.. లింబో స్కేటింగ్‌లో ఆమెకు శిక్షణ ఇచ్చారు. దేశ్నా విజయంలో ఆమె నానమ్మ దయానాహర్ కూడా కీలకపాత్ర పోషించారు. దేశ్నాను ప్రోత్సహిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్‌పై ఇష్టం పెంచుకున్న ఈ చిన్నారి రాక్ ఆన్‌వీల్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. అనేక పోటీల్లో పాల్గొని అవార్డులు గెలుచుకుంది.
'గిన్నిస్ రికార్డు గురించి కోచ్ చెబితే నమ్మలేదు'..
గిన్నిస్ బుక్‌లో చోటు దక్కడంపై చిచ్చరపిడుగు సంతోషం వ్యక్తం చేసింది. తొలుత భయపడినప్పటికీ.. కఠోర సాధనతో ఈ విజయం సొంతమైనట్లు దేశ్నా పేర్కొంది. గిన్నిస్ రికార్డు గురించి కోచ్ చెప్పినప్పుడు తాను నమ్మలేదని ఆమె తండ్రి ఆదిత్య నాహర్ తెలిపారు. ఆమె సాధన చూసిన తర్వాత విజయం సాధించగలదన్న నమ్మకం ఏర్పడినట్లు దేశ్నా తండ్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఆన్లైన్లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్.. ఓపెన్ చేసి చూస్తే...
భక్తుడికి బంపర్ ఆఫర్.. ప్రసాదం కోసం వెళ్తే చేతిలో రూ.లక్షలు!