ETV Bharat / bharat

'ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్రాలదే!' - ఎస్సీ ఎస్టీలకు పదోన్నతులు

SC ST Reservation in Promotion: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రమాణాలు నిర్ధరించడంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. ఆయా రాష్ట్రాలే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

reservation in promotion to SCs, STs in govt jobs

author img

By

Published : Jan 28, 2022, 11:32 AM IST

SC ST Reservation in Promotion: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపునకు కొలమానాలు తేల్చడంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఆయా రాష్ట్రాలే పరిష్కారం దిశగా సరైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది జస్టిస్​ నాగేశ్వర్​రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.

చివరగా గతేడాది అక్టోబర్​ 26న విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది.

ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరిన కేంద్రం.. ఆయా రాష్ట్రాలు అనుసరించే విధంగా కచ్చితమైన, నిర్దిష్టమైన ఒక విధానం తీసుకురావాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​.. ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలు ప్రధాన స్రవంతి నుంచి దూరంగా ఉన్నారని, వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు.

'75 ఏళ్లయినా న్యాయం చేయలేకపోతున్నాం..'

అంతకుముందు.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీ, ఎస్టీలను ప్రతిభలో ఉన్నత వర్గాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్​ 6న సుప్రీంకు తెలిపింది. ఇది వాస్తవమని, దీనిని పరిష్కారంగా సుప్రీంకోర్టే తగిన ప్రతిపాదనలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించింది. అప్పుడు కూడా ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: ఓటుబ్యాంకులతో రిజర్వేషాలు.!

'ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు కల్పించాలంటే అలా చేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.