ETV Bharat / bharat

మకరజ్యోతి వెలిగే కొండపై ఆ పూజలు.. మాజీ పూజారే నిందితుడు.. అధికారులు సీరియస్ - పొన్నాంబలమేడు శబరిమల పూజలు

పవిత్రమైన శబరిమల కొండపైకి కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా వెళ్లి పూజలు చేశారు. మకరజ్యోతి వెలిగే కొండపై పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రాగా.. దేవస్థానం అధికారులు సీరియస్ అవుతున్నారు.

sabarimala-makarajyoti-hill-illegal-puja

author img

By

Published : May 16, 2023, 5:28 PM IST

కేరళ శబరిమలలో పవిత్రమైన మకరజ్యోతి వెలిగే కొండపై కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా పూజలు నిర్వహించడం వివాదాస్పదమైంది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. పొన్నాంబలమేడు కొండపై కూర్చొని పూజలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. మంత్రాలు చదువుతూ, పూలు, ఆకులు చల్లుతూ ఆ వ్యక్తి పూజలు చేశాడు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తితో పాటు మరో నలుగురు అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నాంబలమేడు కొండపై పూజలు చేస్తున్నామని ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడటం వీడియోలో వినిపిస్తోంది.

పూజ చేసిన వ్యక్తిని నారాయణ స్వామిగా గుర్తించారు. గతంలో అతడు శబరిమల ఆలయ పూజారి వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. నాలుగు రోజుల క్రితమే వీరు పూజలు చేసినట్లు సమాచారం. అతడి బృందంలోని ఓ వ్యక్తి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. వారు ఆ కొండపై నుంచి శబరిమల ఆలయాన్ని సైతం వీడియో తీశారు. పటిష్ఠ భద్రత ఉండే ఈ కొండపై పూజలు చేయడంపై దేవస్థానం బోర్డు అధికారులు సీరియస్ అవుతున్నారు.

sabarimala-makarajyoti-hill-illegal-puja
వైరల్ వీడియోలో కనిపిస్తున్న కొండ పరిసరాలు

"ఈ వ్యవహారం అయ్యప్ప భక్తుల మనోభావాలకు సంబంధించినది. రాష్ట్ర డీజీపీతో పాటు అటవీ శాఖ చీఫ్​కు దీనిపై ఫిర్యాదు చేశాం. వీడియోలో కనిపిస్తున్న నిందితుడి పేరు నారాయణ స్వామి. కొన్నేళ్ల క్రితం శబరిమల ఆలయంలో ఉప పూజారిగా పనిచేశారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని పనిలో నుంచి తీసేశాం."
- కె. అనంతగోపన్, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు

పొన్నాంబలమేడు కొండపై ఏటా మకరజ్యోతి వెలుగుతుంది. ఈ కొండ శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కొండ.. రాష్ట్ర అటవీ శాఖ అధీనంలో ఉంటుంది. నిందితులు భద్రతా సిబ్బంది లేని మరో మార్గం నుంచి వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే, వీరి వాదనను అనంతగోపన్ కొట్టిపారేశారు. అంతమంది కలిసి హైసెక్యూరిటీ జోన్​లోకి ప్రవేశించి పూజలు ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. అయ్యప్ప స్వామి ఆలయం పవిత్రతకు భంగం కలిగించేందుకు నిందితులు కావాలనే పూజలు చేసి ఉంటారని అన్నారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై దుమారం చెలరేగిన నేపథ్యంలో నిందితుడు నారాయణ స్వామి స్పందించాడు. ఓ ప్రైవేటు ఛానల్​తో మాట్లాడిన అతడు.. పూజలు చేసిన ప్రాంతం పొన్నాంబలమేడు (మకరజ్యోతి వెలిగే కొండ) కాదని చెప్పుకొచ్చాడు.

వివాదాల స్వామి
నారాయణస్వామిపై అనేక వివాదాలు ఉన్నాయి. శబరిమల ప్రధాన పూజారి అనే నేమ్​ప్లేట్​ను కారుకు తగిలించుకొని ప్రయాణించిన కేసులో పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు. ఉప పూజారిగా పనిచేసిన సమయంలో.. శబరిమలకు వచ్చిన భక్తులకు నకిలీ పూజ టోకెన్లు ఇచ్చాడనే కేసు సైతం అతడిపై నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.