ETV Bharat / bharat

భారత్​కు త్వరలోనే ఎస్​-400 క్షిపణులు

భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్​-400 (s400 India) చేరనుంది. ఒప్పందం మేరకు భారత్​కు ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐదు క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్​ 500 కోట్ల​ డాలర్లు ఖర్చు చేస్తోంది.

S-400 missile
ఎస్​-400 క్షిపణులు
author img

By

Published : Nov 14, 2021, 5:43 PM IST

రష్యా నుంచి భారత్‌ (s400 India) కొనుగోలు చేసిన ఎస్​-400 క్షిపణుల అందజేత ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ క్షిపణులు చైనా, టర్కీకు ఇచ్చామని మరో ఏడు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

మొదటి నుంచి రక్షణ రంగంలో కీలక ఆయుధ సామగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్​ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఎస్​-400 గగనతల రక్షణ వ్యవస్థను (s-400 Missile System India) కొనుగోలు చేసుకునేందుకు 2018, అక్టోబర్​లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం.. 500 కోట్ల​ డాలర్లను ఖర్చు చేస్తోంది భారత్​. ఇప్పటికే గతేడాది 800 మిలియన్​ డాలర్లను రష్యాకు చెల్లించింది. అయితే దీనిపై తొలి నుంచి అమెరికా (s400 india-us) అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం వల్ల రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ప్రాంతీయ భద్రత, రక్షణ అవసరాలరీత్యా భారత్‌కు ఎస్​-400 విషయంలో మినహాయింపునివ్వాలని కోరుతూ అక్కడి సెనేటర్లు అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే రష్యా నుంచి ప్రకటన రావడం గమనార్హం.

ఎస్​-400.. రష్యా రూపొందించిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ. దీర్ఘశ్రేణిలో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ట్రయాంఫ్​ ఇంటర్​సెప్టర్​ ఆధారిత క్షిపణి వ్యవస్థ.. 400 కిలోమీటర్ల దూరంలోని శుత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.

ఇవీ చూడండి:

భారత్‌పై 'కాట్సా' వద్దంటూ బైడెన్‌కు సెనేటర్ల లేఖ

అక్టోబర్-డిసెంబర్ మధ్య భారత్​కు ఎస్​-400

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.