ETV Bharat / bharat

పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​- ఆర్టీసీ కండక్టర్​ ఘనకార్యం! - కోడిపిల్లకు హాఫ్ టికెట్

Ticket for baby chick: కోడిపిల్ల ఓ కుటుంబానికి పెద్ద నష్టమే తెచ్చిపెట్టింది. రూ.10కి దాన్ని ఆ కుటుంబం కొనుగోలు చేసి బస్సు ఎక్కింది. అయితే.. బస్సు కండక్టర్ దానికి రూ.50 టికెట్​ వేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..?

Ticket for baby chick
బస్సులో కోడిపిల్లకు టికెట్​
author img

By

Published : Jan 2, 2022, 2:29 PM IST

Updated : Jan 2, 2022, 2:53 PM IST

పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​

Ticket for baby chick: బస్సులో భారీ వస్తువులను ఏవైనా తీసుకువెళితే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనకు తెలుసు. అయితే.. సంచిలో కొడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలనే విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? కర్ణాటకలో ఈ వింత సంఘటన జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం తమతోపాటు కోడిపిల్లను తీసుకువెళ్లిందని దానికి హాఫ్​ టికెట్ కొట్టాడు కండక్టర్​.

Ticket for baby chick
బస్సులో కోడిపిల్ల

అసలేమైందంటే..?

Baby chick in bus: ఉత్తర కన్నడ జిల్లా సిద్ధపుర నుంచి ఓ సంచార జాతి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు... రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని వారు... హోసనగర నుంచి షిరూరుకు డిసెంబరు 31న ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్​ఆర్​టీసీ) బస్సులో పయనమయ్యారు. హోసనగర వద్ద బస్సు ఎక్కిన వారు.. మూడు టికెట్లు కావాలని కండక్టర్​ను అడిగారు.

Ksrtc ticket for baby chick: అయితే.. ఆ సమయంలో వారి సంచిలో నుంచి 'కిచ్​కిచ్​' అని శబ్దం రావడాన్ని ఆ బస్సు కండక్టర్ గమనించాడు. ఇక వారి సంచిని పరిశీలిస్తే కోడిపిల్ల కనిపించింది. దాంతో కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్​ తెలిపాడు. బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని అతడు చెప్పగా.. చేసేదేం లేక దానికి హాఫ్ టికెట్ తీసుకుంది ఆ కుటుంబం.

Ticket for baby chick
కోడిపిల్లకు హాఫ్ టికెట్​

అయితే... రూ.10కి కోడి పిల్లను కొనుగోలు చేయగా.. రూ.50 పెట్టి దానికి టికెట్​ తీసుకోవడమే విశేషం. ఇక వారి ప్రయాణానికి మొత్తం రూ.353 ఖర్చు అయింది.

ఇదీ చూడండి: Live video: బాలికపై వీధి కుక్కల దాడి.. కిందపడేసి..

ఇదీ చూడండి: ఏడాదిగా జీరో కరోనా మరణాలు​​.. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లింపు

Last Updated : Jan 2, 2022, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.