ETV Bharat / bharat

ఆస్పత్రికి వెళ్తూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బొలేరో.. తల్లీకొడుకు సహా ఏడుగురు మృతి - ఉత్తర్​ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

Road Accident in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.

road accident in banda
road accident in banda
author img

By

Published : Jun 30, 2023, 6:46 AM IST

Updated : Jun 30, 2023, 9:02 AM IST

Road Accident in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు సహా ఏడుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మందిలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరెంట్ షాక్​కు గురైన బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ జరిగింది
తిలౌసా గ్రామానికి చెందిన 15 ఏళ్ల కల్లు కరెంట్ షాక్​కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం అతడిని బబేరూలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్నారు. బాలుడి తల్లి సహా గ్రామానికి చెందిన మరో ఏడుగురు ఓ బొలేరో కారులో ప్రయాణిస్తున్నారు. ఆస్పత్రికి తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా కారును నడిపాడు డ్రైవర్​. ఈక్రమంలోనే పరాయియాదయీ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆపిన ఓ ట్రక్కును ఢీ కొట్టారు.

దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హుటాహుటిన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు నుజ్జునుజ్జు కావడం వల్ల గ్యాస్ కట్టర్​ సహాయంతో బొలేరోలో చిక్కుకున్న బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఎస్​పీ అభినందన్​ సహా జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో బాలుడు, తల్లి సహా గ్రామానికి చెందిన కైఫ్, జహీల్​, షకీర్​, ముసాహిద్​, డ్రైవర్​ మరణించారు. జహీద్​ అనే వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

"తిలౌసాకు చెందిన 8 మంది బాబెరూకు బొలెరోలో వస్తున్నారు. కారు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో ఉండడం వల్ల అదుపుతప్పింది. దీంతో పక్కనే ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది."

-- అభినందన్​, ఎస్పీ

Last Updated : Jun 30, 2023, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.