ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం సొంత తాతయ్యనే.. - gang rape news

Minor Rape In Rajasthan: 12 ఏళ్ల ఓ గిరిజన బాలికపై ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మద్యానికి బానిసై బాలిక తాతయ్య వీరిని అనుమతించాడు.

Minor Rape In Rajasthan
Minor Rape In Rajasthan
author img

By

Published : May 13, 2022, 5:21 AM IST

Updated : May 13, 2022, 6:11 AM IST

Minor Rape In Rajasthan: రాజస్థాన్​ కోటా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. 12 ఏళ్ల గిరిజన బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానికి సొంత తాత సహకారం అందించాడు. బాలిక గర్భవతి కావడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. నిందితులతో పాటు బాలిక తాతను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను గురువారం కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. బాలికకు చికిత్స కొనసాగుతుందని.. అబార్షన్​కు అనుమతి లభించినట్లు పోలీసులు తెలిపారు.

కోట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల గిరిజన బాలిక రోజులాగే పాఠశాలకు వెళ్లింది. అక్కడ కళ్లు తిరిగి పడిపోవడం వల్ల ఆమెను అస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా.. ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక తండ్రి 12 ఏళ్ల కిందే మరణించాడు దీంతో మతిస్తిమితం లేని తన తల్లితో కలిసి తాతయ్య వద్ద నివసిస్తోంది. కాగా, మద్యానికి బానిసైన బాలిక తాతయ్య రూ. 500 కోసం ఆమెపై అత్యాచారానికి ప్రోత్సహించాడు. దీంతో రామ్​లాల్​ భీల్​ అనే 50 ఏళ్ల వ్యక్తి కొన్ని నెలలుగా అత్యాచారం చేశాడు. మరో నిందితుడు 20 ఏళ్ల అజయ్​ భైరవ.. గత ఆరు నెలల్లో అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపెస్తానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడం వల్ల ఈ విషయం బయటికి వచ్చింది.

ఇదీ చదవండి: సరూర్​నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..

Last Updated : May 13, 2022, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.