ETV Bharat / bharat

టీఎంసీ ఎంపీ శంతనుపై సస్పెన్షన్ వేటు - parliament monsoon session live updates

గురువారం ఐటీ శాఖ మంత్రి నుంచి పత్రాలు లాక్కొని చింపివేసిన టీఎంసీ ఎంపీ శంతను సేన్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేయాలని భాజపా ప్రవేశ పెట్టిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరోవైపు పెగాసస్​ వ్యవహారంపై చర్చ చేపట్టాలని విపక్షాలు శుక్రవారం కూడా లోక్​సభ, రాజ్యసభలో ఆందోళనలు కొనసాగించాయి. దీంతో రెండు సభలు వాయిదా పడ్డాయి.

Rajya Sabha proceedings adjourned till 12 noon
విపక్షాల ఆందోళనల నడుమ ఉభయసభలు వాయిదా
author img

By

Published : Jul 23, 2021, 12:07 PM IST

Updated : Jul 23, 2021, 12:17 PM IST

పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చ సందర్భంగా గురువారం రాజ్యసభలో ప్రకటన చేస్తున్న ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతిలో నుంచి ప్రతులను లాగి చించి వేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శంతను సేన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్‌ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్‌ తీర్మానం ప్రవేశపెట్టగా రాజ్యసభ ఆమోదించింది. దీనిని నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ సభలో ఆందోళనకు దిగింది.

సభలో సభ్యులు ప్రవర్తన పట్ల ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా తృణమూల్‌ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలు విరమించకపోవడం వల్ల వెంకయ్య రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

మరోవైపు లోకసభ్​లోనూ పెగాసస్​పై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా.. సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Last Updated : Jul 23, 2021, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.