ETV Bharat / bharat

గుజరాత్‌లో డ్రగ్స్ కలకలం, రూ.2వేల కోట్ల మత్తుపదార్థాలు సీజ్

గుజరాత్​లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. భరూచ్ ప్రాంతంలో 513 కేజీల డ్రగ్స్​ను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళతో సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, వడోదరాలో మరో రూ.వెయ్యి కోట్ల మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 16, 2022, 8:02 PM IST

Gujarat drug bust: గుజరాత్​లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్​ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్​లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు.

gujarat vadodara drugs
రూ.1000 కోట్లు విలువైన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్న అధికారులు

నిఘా వర్గాల సమాచారం మేరకు భరూచ్​లోని అంక్లేశ్వర్​లో ముంబయి ఏఎన్​సీ రైడ్లు నిర్వహించింది. ఇక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఏకంగా 513 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. ఈ కేసులో ఓ మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1026 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ యూనిట్ తయారీ యజమాని గిరిరాజ్​ దీక్షిత్​ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 3వ తేదీన కూడా ముంబయి యాంటీ నార్కొటిక్స్ సెల్ భారీగా డ్రగ్స్​ను సీజ్ చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరోవైపు, వడోదరాలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) సుమారు రూ.1000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసింది. వడోదరా సమీపంలోని మోక్సీ గ్రామ పరిసరాల్లో ఉన్న నెక్టర్ కెమికల్ ఫ్యాక్టరీలో 200 కేజీల డ్రగ్స్​ను అధికారులు గుర్తించారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ అధికారులతో కలిసి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తయారీకి ముడిసరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు పంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

raid of Gujarat ATS
గుజరాత్ ఏటీఎస్ సోదాలు
raid of Gujarat ATS
గుజరాత్ ఏటీఎస్ సోదాలు
raid of Gujarat ATS
గుజరాత్ ఏటీఎస్ సోదాలు

ఇవీ చదవండి: భారత సైన్యానికి సరికొత్త అస్త్రాలు, దుందుడుకు చైనాకు ఇక చెక్

బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.