ETV Bharat / bharat

Rahul Gandhi On Women Reservation Bill : 'మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇంకా పదేళ్లు.. ఇవి దృష్టి మళ్లించే రాజకీయాలు' - మహిళా రిజర్వేషన్​ బిల్లుపై రాహుల్​

Rahul Gandhi On Women Reservation Bill : మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి వచ్చేందుకు ఇంకా పదేళ్లు పడుతుందని ఆరోపించారు.

Rahul Gandhi On Women Reservation Bill
Rahul Gandhi On Women Reservation Bill
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:54 PM IST

Updated : Sep 22, 2023, 1:40 PM IST

Rahul Gandhi On Women Reservation Bill : మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి వచ్చేందుకు ఇంకా పదేళ్లు పడుతుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని జనగణన చేయించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళల రిజర్వేషన్​లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సమయంలోనే ఓబీసీ కోటా కల్పిస్తే బాగుండేదని రాహుల్‌ అభిప్రాయ పడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి కులగణన, డీలిమిటేషన్​ను కారణంగా చూపడం దారుణమని విమర్శించారు రాహుల్. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన సమాచారం లేకుండా పథకాలు ఎలా రూపొందిస్తారని నిలదీశారు. ప్రజలకు అధికారం ఇచ్చేందుకు కులగణన అత్యవసరమని.. అధికారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు.

  • #WATCH | Women's Reservation Bill | Congress MP Rahul Gandhi says, "What is it that you are being diverted from? From OBC Census. I spoke of one institution in Parliament, that which runs the Government of India - Cabinet secretary and secretaries...I asked why only three out of… pic.twitter.com/6WVKGgYXb8

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రిజర్వేషన్ల అమల్లోనే సమస్య ఉంది. ప్రస్తుతం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్నాం కానీ.. పదేళ్ల తర్వాతే రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని అర్థం ఏమిటి ? ఈ బిల్లుకు మేం మద్దతు ఇస్తున్నాం. అయితే జనగణన, డీలిమిటేషన్‌ నిబంధనలను తొలగించండి. వెంటనే రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురండి. భారత మహిళల తెలివిని మీరు అవమానపరచొద్దు. ఓబీసీ జనగణన నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది. ఓబీసీలకు ఎంతో చేస్తున్నానని ప్రధాని చెబుతున్నారు. అయితే భారత ప్రభుత్వంలో కీలకమైన 90 మంది సెక్రటరీలు, క్యాబినేట్‌ సెక్రటరీలలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారు?"

--రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

    — ANI (@ANI) September 22, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉభయ సభల్లో ఆమోదం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్‌ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. గురువారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. ఈ బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. అంతకుముందు లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. 8 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం ఈ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లురాగా వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Parliament Session Sine Die : షెడ్యూల్​కు ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా.. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందాకే..

Modi Speech Today In Bjp Office : 'మెజారిటీ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి.. మహిళా బిల్లే అందుకు సాక్ష్యం'

Last Updated : Sep 22, 2023, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.