ETV Bharat / bharat

నైట్​క్లబ్​లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్​.. భాజపా విమర్శలు​!

Rahul Gandhi at nightclub: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. నేపాల్​లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించి రాహుల్ ఓ నైట్​క్లబ్​లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై భాజపా నేతలు విమర్శలకు దిగగా.. కాంగ్రెస్ వారికి దీటుగా బదులిచ్చింది.

Rahul Gandhi at nightclub
Rahul Gandhi at nightclub
author img

By

Published : May 3, 2022, 1:08 PM IST

Updated : May 3, 2022, 1:52 PM IST

Rahul Gandhi at nightclub: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ నైట్​క్లబ్​లో కనిపించడం చర్చనీయాంశమైంది. నేపాల్ కాఠ్​మాండూలోని లార్డ్ ఆఫ్ రింగ్స్ క్లబ్​లో రాహుల్ కనిపించారు. ఓ ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. డిస్కో లైట్ల మధ్య చుట్టూ స్నేహితులతో ఆయన కనిపించారు. అతడి చుట్టూ ఉన్నవారు ఆల్కహాల్ తాగుతూ ఉన్నారు. 'కాఠ్​మాండూ పోస్ట్' కథనం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాఠ్​మాండూకు వెళ్లారు. నేపాల్ రాయబారి భీమ్ ఉదాస్ కూతురు సుమ్నిమా వివాహానికి ఆయన హాజరయ్యారు.

Rahul Gandhi Nepal marriage: ఈ వీడియోపై పలువురు భాజపా నేతలు స్పందిస్తూ రాహుల్​ను విమర్శించారు. 'రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు, ఫుల్ టైమ్ టూరిస్ట్' అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ధ్వజమెత్తారు. మరోవైపు, సాధారణ పౌరుడిగా పార్టీలకు వెళ్తే తప్పులేదని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. కానీ రాహుల్ ఓ పార్లమెంట్ సభ్యుడిగా, ఓ జాతీయ పార్టీ అగ్రనేతగా వెళ్లారని అన్నారు. 'పార్టీలు, హాలీడేలు, విదేశీ పర్యటనలు దేశానికి ఇప్పుడు కొత్తేం కాదు. సాధారణ వ్యక్తిగా వెళ్తే సమస్యే లేదు. కానీ, ఇతరులకు సందేశాలు ఇస్తూ.. ఓ ఎంపీగా, జాతీయ పార్టీ శాశ్వత బాస్​గా వెళ్తే..' అంటూ ట్వీట్ చేశారు రిజిజు.

Rahul Gandhi party: ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ పర్యటనపై వివరణ ఇచ్చింది. వివాహాలకు హాజరు కావడం సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమేనని.. అది నేరం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'ప్రైవేట్ వివాహ ఫంక్షన్​కు హాజరయ్యేందుకు స్నేహపూర్వక దేశమైన నేపాల్​కు రాహుల్ గాంధీ వెళ్లారు. వివాహ వేడుకకు హాజరు కావడం ఇప్పటివరకైతే నేరం కాదు. కానీ, భాజపా ఇకపై దానిని కూడా చట్టవిరుద్ధంగా మారుస్తుందేమో! అలా జరిగితే మాకు కూడా చెప్పండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల వివాహాలకు వెళ్లే సంప్రదాయాన్ని మార్చుకుంటాం' అంటూ ఎద్దేవా చేశారు సుర్జేవాలా.

''ప్రధాని మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా. జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్‌ వెళ్లారు. ఇందులో తప్పేం లేదు. ఇదేం నేరం కాదు. బహుశా.. స్నేహితులు, కుటుంబసభ్యుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా భావిస్తూ భాజపా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదేమో.''

- రణదీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

2015లో మోదీ అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె వివాహానికి అనూహ్యంగా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సుర్జేవాలా విమర్శించారు.

ఇదీ చదవండి: రంజాన్​ వేళ జోధ్​పుర్​లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్​ బంద్​

Last Updated : May 3, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.